Parliament Session 2024: జైలులో ఉన్న ఎంపీలు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు.. ? పార్లమెంట్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే.. ?

Parliament Session 2024: 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందులో ప్రధాని సహా పలువురు సభ్యులు ఈ రోజుతో పాటు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే  ప్రజలు ఎన్నుకున్న ఇద్దరు ఎంపీలు జైలు శిక్ష అనుభవిస్తూ లోక్ సభకు ఎన్నిక కావడం అందరినీ ఆశ్యర్యానికి గురిం చేసింది. అయిలే జైల్లో ఉంటూ వీళ్లిద్దరు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారు.. ? అందుకు సంబంధించిన రూల్స్ ఏమిటో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 24, 2024, 11:35 AM IST
Parliament Session 2024: జైలులో ఉన్న ఎంపీలు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు.. ? పార్లమెంట్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే.. ?

Parliament Session 2024: 2024లో దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్ధానాలకు గాను 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో గుజరాత్ లోని ‘సూరత్’ స్థానానికి ఏకగ్రీవం అయింది. మొత్తంగా 543  మంది సభ్యుల్లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ సహా రాజకీయంగా అతిరథ మహారథులతో పాటు ఫస్ట్ టైమ్ ఎన్నికైన వారు.. పలు రంగాలకు చెందిన వ్యక్తులు హాజరయ్యారు. అందలో ఇద్దరు సభ్యుల ఎన్నిక అందరినీ ఆశ్యర్యపరిచింది. అందులో ఒకరు పంజాబ్ లోని ఖడూరు సాహిబ్ స్థానం నుంచి ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ ఎంపీగా ఎన్నికయ్యారు. అటు ఇంజినీర్ రషీద్.. జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా  నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం వీరిద్దరు పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్.. ప్రత్యేక ఖలిస్థాన్ అంటూ వేర్పాటువాదానికి ఊతం ఇచ్చే కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అతన్ని అరెస్ట్ చేసింది.  ప్రస్తుతం అతను అస్సామ్ లోని డిబ్రూగడ్ జైలులో ఉన్నారు. మరోవైపు ఉగ్ర నిధుల మల్లింపు కేసులో ఇంజనీర్ రషీద్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దీంతో పార్లమెంట్ కు ఎన్నికైన వీరిద్దరు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నిబంధనలు అనుమతిస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజ్యాంగం ప్రకారం వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేసేందుకు అర్హులే అని లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ .. ప్రముఖ రాజ్యంగ కోవిదులు పీడీటీ ఆచారి తెలిపారు. ఇలాంటి కేసుల్లో రాజ్యంగ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే అని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో చట్ట సభలకు ఎన్నికైన వ్యక్తి  ప్రమాణ స్వీకారం చేయడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే ప్రెజెంట్ వీరిద్దరు వివిధ జైల్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అంతేకాదు వీరు ప్రమాణ స్వీకారం కోసం పార్లమెంట్ తీసుకెళ్లెందకు అధికారులు ప్రత్యేక అనుమతులు మంజూరు చేయాలి. ప్రమాణ స్వీకారం పూర్తైయిన వెంటనే తిరిగి జైలుకు వెళ్లిపోవాలి.

అంతేకాదు జైల్లో ఉన్న వ్యక్తులు పార్లమెంట్ లేదా అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఎలాంటి అనుమతులు ఉండవు. చట్టం అందుకు అనుమతించదు. అందువల్ల  జైల్లో ఉన్న ఈ ఇద్దరు ఎంపీలు తాము రిమాండ్ ఖైదీలుగా ఉన్న కారణంగా లోక్ సభ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నామని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి రిక్వెస్ట్ ను స్పీకర్ లోక్ సభ సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్ కమిటీకి నివేదవిస్తారు. వీరి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయాలా ? వద్దా అన్న దానిపై ఆ హౌస్ కమిటీ పలు సూచనలు చేస్తోంది. వాటిపై సభలో ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకుంటారని రాజ్యంగ నిపుణులైన ఆచారి  తెలిపారు.

ఒక ఎంపీ పార్లమెంట్ కు హాజరై తర్వాత.. ప్రమాణ స్వీకారం చేయకపోయినా.. వరుసగా 60 రోజులు సభకు డుమ్మా కొట్టినా.. అతని స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అవకాశం లోక్ సభకు ఉంది. లోక్ సభ స్పీకర్ అనుమతి లేకుండా సభకు గైర్హాజరు కావడంపై రాజ్యాంగంలోని 101(4)  ఆర్టికల్ స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు సదరు రిమాండ్ ఖైదీ రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష ఖరారైతే మాత్రం అతన్ని అనర్హుడు అవుతాడు.

Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News