Paresh Rawal: విలక్షణ నటుడికి కీలక పదవి

భారత సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా.. బీజేపీ నాయకుడిగా.. పేరు ప్రఖ్యాతలు గడించిన పరేష్‌ రావల్‌ ( Paresh Rawal ) కు కీలక పదవి దక్కింది.

Last Updated : Sep 11, 2020, 09:16 AM IST
Paresh Rawal: విలక్షణ నటుడికి కీలక పదవి

Paresh Rawal appointed NSD chairman: ఢిల్లీ: భారత సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా.. బీజేపీ నాయకుడిగా.. పేరు ప్రఖ్యాతలు గడించిన పరేష్‌ రావల్‌ ( Paresh Rawal ) కు కీలక పదవి దక్కింది. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా (NSD) నూతన చైర్మన్‌గా పరేష్‌ రావల్‌ నియమితులయ్యారు. ఎన్‌ఎస్‌డీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. విద్యార్థులు ఆయన ప్రతిభను వినియోగించుకోవాలని మంత్రి ప్రహ్లాద్ పటేల్ ట్విట్ చేశారు. ఆయన నాయకత్వంలో ఎన్‌ఎస్‌డీ ఉన్నత స్థాయికి వెళ్తుందని ఎన్ఎస్‌డీ ట్విట్ చేసింది.  Also read: Kisan Rail: అనంతపురం నుంచి ఢిల్లీ చేరిన తొలి కిసాన్ రైలు

ఇదిలాఉంటే.. 2017 నుంచి నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలో పద్మశ్రీ అవార్డుతోపాటు, జాతీయ చలన చిత్ర అవార్డు అందుకున్న పరేశ్ రావల్‌ను చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పరశ్ రావల్ నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఇదిలాఉంటే.. పరేష్‌ రావల్‌ నియామకం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు హర్షం వ్యక్తం చేశారు. Also read: AstraZeneca Vaccine: ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్

Trending News