కాల్పులు జరపొద్దని బీఎస్ఎఫ్‌ను వేడుకున్న పాక్ రేంజర్లు

సరిహద్దులో తమ జవాన్లపై కాల్పులు జరపవద్దని బీఎస్ఎఫ్‌(సరిహద్దు భద్రతాదళం)ను పాకిస్తాన్ ఆర్మీ కోరింది.

Last Updated : May 20, 2018, 07:41 PM IST
కాల్పులు జరపొద్దని బీఎస్ఎఫ్‌ను వేడుకున్న పాక్ రేంజర్లు

జమ్ముకాశ్మీర్: సరిహద్దులో తమ జవాన్లపై కాల్పులు జరపవద్దని బీఎస్ఎఫ్‌(సరిహద్దు భద్రతాదళం)ను పాకిస్తాన్ ఆర్మీ కోరింది. పాక్ వైపు నుంచి రాకెట్ షెల్స్ దాడి జరగడంతో బీఎస్ఎఫ్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. గత మూడు రోజుల నుంచి పాకిస్థాన్ స్థావరాలపై భారత బలగాలు తీవ్రంగా దాడి చేశాయి. దీన్ని తట్టుకోలేక 'కాల్పులు ఆపండి' అంటూ బీఎస్ఎఫ్ స్థావరానికి పాక్ బలగాలు ఫోన్ చేసి వేడుకున్నాయి. ఇందుకు సంబంధించి 19 సెకన్ల వీడియోను బీఎస్ఎఫ్ విడుదల చేసింది.  

గత కొద్ది రోజుల నుంచి పాకిస్థాన్ రేంజర్లు.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి విదితమే. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పులకు ఇద్దరు జవాన్లు.. పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న బీఎస్‌ఎఫ్ జవాన్లు.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ పికెట్‌ను ధ్వంసం చేశారు. మే 19న పికెట్‌ను ధ్వంసం చేసినట్లు చెప్పిన బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు.. పాక్ పికెట్‌ను పేల్చేసిన 19 సెకన్ల నిడివి గల వీడియోను విడుదల చేశారు.

కాగా.. ఈ ఏడాదిలో పాక్ జరిపిన కాల్పులకు 38 మంది మృతి చెందారు. వీరిలో 18 మంది జవాన్లు ఉన్నారు.

 

 

Trending News