Delhi Airport: రైల్వే స్టేషన్‌ను తలపిస్తున్న ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. అసలు కారణం ఏంటంటే?!!

ఒమిక్రాన్‌ వ్యాప్తి దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోన్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కరోనా టెస్ట్ తప్పనిసరి చేశారు. దీంతో టెస్ట్ ఫలితాలు వచ్చేవరకు  ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఢిల్లీ ఎయిర్‌పోర్టు రైల్వే స్టేషన్‌ను తలపిస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 03:18 PM IST
Delhi Airport: రైల్వే స్టేషన్‌ను తలపిస్తున్న ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. అసలు కారణం ఏంటంటే?!!

Huge crowd waiting for Coronavirus results at Delhi International Airport: సాధారణంగా పండగల సమయంలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌, ఎయిర్‌పోర్టులు జనాలతో కిటలాడిపోతాయి. పండగకు ముందు, తర్వాత ఎక్కడ చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. అయితే సంక్రాంతి పండగకు ఇంకా నెల సమయం ఉన్నా.. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi International Airport) జనాలతో రద్దీగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియెంట్ 'ఒమిక్రాన్‌' (Omicron ) భయంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కఠిన నిబంధనలు అమలు పరచడమే. 

దేశంలో ఒమిక్రాన్‌ (Omicron) భాదితులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 27 కేసులు నమోదయ్యాయి. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. వైరస్‌ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు (Passengers) ఎయిర్‌పోర్టుల్లో కరోనా టెస్ట్ తప్పనిసరి చేశారు. దీంతో టెస్ట్ ఫలితాలు వచ్చేవరకు  ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఢిల్లీ ఎయిర్‌పోర్టు రైల్వే స్టేషన్‌ను తలపిస్తోంది.

Also Read: IND vs NZ: వావ్.. భారత్-న్యూజీలాండ్ ఆటగాళ్ల పేర్లు భలే కలిసాయే! అశ్విన్ నువ్ సూపరో సూపర్!!

విదేశాల నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)కు వచ్చే ప్రయాణికులకు అక్కడి అధికారులు సాధారణ ఆర్‌టీ-పీసీఆర్‌ (RT-PCR) టెస్ట్ లేదా ర్యాపిడ్‌ పీసీఆర్‌ టెస్ట్‌ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టుకు రూ.500, ర్యాపిడ్‌ పీసీఆర్‌ టెస్ట్‌కు రూ.3,500లుగా ధర నిర్ణయించారు. ఆర్‌టీ-పీసీఆర్‌ రిజల్ట్ రావాలంటే ప్రయాణికులు 6-8 గంటలు ఎదురుచూడాల్సి ఉంది. ర్యాపిడ్‌ టెస్ట్ ఫలితం మాత్రం రెండు గంటల్లో వస్తుంది. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితానికి చాలా సేపు పడుతుండటంతో.. ఖర్చు ఎక్కువైనా ప్రయాణికులు ర్యాపిడ్‌ టెస్టులే  చేయించుకుంటున్నారు. అయినా కూడా ఆదివారం రోజున ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చాలామంది ప్రయాణికులు (Huge Crowd) ఉన్నారు. ఇమ్మిగ్రేషన్‌ డెస్కుల వద్ద రద్దీ ఎక్కువగా ఉందట. 

Also Read: Honour killing: మహారాష్ట్రలో పరువు హత్య-యువతి తల నరికి సోదరుడి పైశాచికత్వం...

కరోనా ఫలితం కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని కొందరు ప్రయాణికులు (Passengers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులే హాట్‌ స్పాట్‌లుగా (కరోనా సోకే కేంద్రం) మారుతున్నాయని ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేశారు. మాస్క్‌లు, భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో ఇక్కడే కరోనా సోకేటట్టు ఉందని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు ప్రయాణికులు అక్కడి జనాలను ఫొటో తీసి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News