Next Exam: నీట్ పీజీ స్థానంలో నెక్స్ట్ పరీక్ష, సిలబస్ ఏంటి, పరీక్ష ఎలా ఉంటుంది, నిబందనలేంటి

Next Exam: ఎంబీబీఎస్ విద్యార్ధులకు కీలకమైన అప్‌డేట్ ఇది. మరో రెండేళ్ల తరువాత పీజీ నీట్ పరీక్ష ఉండదు. ఆ స్థానంలో మరో పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ఎలా ఉంటుంది. విధి విదానాలేంటనే వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 4, 2022, 06:39 PM IST
Next Exam: నీట్ పీజీ స్థానంలో నెక్స్ట్ పరీక్ష, సిలబస్ ఏంటి, పరీక్ష ఎలా ఉంటుంది, నిబందనలేంటి

బ్యాచ్‌లర్ వైద్య విద్య అభ్యసించిన విద్యార్ధులు పీజీ చేయాలంటే పీజీ నీట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే ఇది 2023 వరకే. ఆ తరువాత రెండు దశల్లో జరిగే నెక్స్ట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అంటే పీజీ ఇక మరింత కష్టతరం కానుంది.

వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ 2023 చివరి పరీక్ష కానుంది.  2024 నుంచి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఆధారంగా మెడికల్ పీజీ ప్రవేశాలుంటాయి. నీట్ పీజీ పరీక్ష స్థానంలో కొత్తగా నెక్స్ట్ పరీక్ష ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే నేషనల్ మెడికల్ కమీషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వైద్యరంగంలో కీలకమైన మార్పుల కోసం ఎన్ఎంసీ కార్యాచరణ ఇది. అసలు నెక్స్ట్ పరీక్ష అవసరమేంటి, ఎందుకీ మార్పనేది తెలుసుకుందాం.

నెక్స్ట్ పరీక్ష ఎందుకు

ఎంబీబీఎస్ పూర్తయిన తరువాత పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశం కోసం జరిపే నీట్ పీజీ ఎంట్రన్స్, విదేశాల్లో ఎంబీబీఎస్ చదివే విద్యార్ధులు దేశంలో ప్రాక్టీసు కోసం రాయాల్సిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్‌లకు బదులు ఒకటే పరీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు ఉన్నత విద్య చదివేందుకు, ప్రాక్టీస్, రిజిస్ట్రేషన్ కోసం వేర్వేరు పరీక్షలు నిర్వహించకుండా ఒకటే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక నుంచి అన్నింటికీ కలిపి ఒకటే పరీక్ష నెక్స్ట్ ఉంటుంది.

నెక్స్ట్ పరీక్ష ఎలా ఉంటుంది

నెక్స్ట్ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. ఎంబీబీఎస్ పైనల్ థియరీ భాగం పూర్తయ్యాక నెక్స్ట్-1,  ఆ తరువాత 12 నెలల ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక నెక్స్ట్ 2 ఉంటుంది. నెక్స్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ, స్టేట్ మెడికల్ రిజిస్ట్రీల్లో పేరు నమోదుకు అవకాశముంటుంది. 

నెక్స్ట్ 1 లో థియరీ, నెక్స్ట్ 2లో ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఈ రెండు దశల్లో ఎంబీబీఎస్‌లో ఉండే 19 సబ్జెక్టుల్నించి 240 ప్రశ్నలుంటాయి. మొత్తం 960 మార్కులకు ఈ పరీక్షలుంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు, ఒక మార్కు నెగెటివ్ ఉంటుంది. మరో నిబంధనేంటంటే రెండు దశల పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాలి. రెండింట్లోనూ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

Also read: Viral Leave Letter: మా అమ్మ 5న చనిపోతది.. సెలవులు కావాలి! వైరల్ అవుతోన్న టీచర్స్ లీవ్ లెటర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News