Threat mail claims PM Modi Assasination: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి వచ్చిన ఓ ఈమెయిల్ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయబోతున్నామని పేర్కొంటూ ఓ అగంతకుడు ఎన్ఐఏకి మెయిల్ పంపించాడు. ఇందుకోసం ఇప్పటికే ప్లాన్ సిద్ధమైందని, ఇక దాన్ని అమలుచేసేందుకు వేచి చూస్తున్నామని పేర్కొన్నాడు. పలు ఉగ్రవాద సంస్థలు ఈ ప్లాన్‌లో భాగమయ్యాయని తెలిపాడు.
అంతేకాదు, మోదీ హత్య ప్లాన్ అమలుకు ఇప్పటికే 20 మంది స్లీపర్ సెల్స్‌ను రంగంలోకి దిగారని పేర్కొన్నాడు. ఈ 20 మంది 20 కేజీల ఆర్డీఎక్స్ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. మరో ట్విస్ట్ ఏంటంటే.. మెయిల్ చేసిన అగంతకుడు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపాడు. తద్వారా ఇక హత్య కుట్రకు సంబంధించిన ప్లాన్ బహిర్గతమయ్యే అవకాశం ఉండదని పేర్కొన్నాడు.
అగంతకుడు పంపిన మెయిల్‌తో ఎన్ఐఏ అప్రమత్తమైంది. ఆ మెయిల్‌ను పలు భద్రతా విభాగాలతో పాటు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీకి పంపించింది. ఆ మెయిల్ ఐపీ అడ్రెస్‌ను కనుగొనేందుకు సైబర్ విభాగం ప్రయత్నిస్తోంది. ఐపీ అడ్రెస్ తెలిస్తే.. ఆ మెయిల్ పంపించిన అగంతకుడి ఆచూకీని గుర్తించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామంటూ గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: చికెన్ వివాదం... రణరంగాన్ని తలపించిన ఘటన.. యాసిడ్ దాడిలో 10 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook