NIA raids locations linked to Dawood Ibrahim's associates in Mumbai: గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతడి హవాలా ముఠాపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం ఉదయం దాడులు చేపట్టింది. ముంబైలోని దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. దావూద్ అనుచరులు, హవాలా వ్యాపారులే టార్గెట్‌గా ఎన్‌ఐఏ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో దావూద్ అనుచరుడు సలీమ్ ఫ్రూట్‌ను అదుపులోకి తీసుకున్నారు. దావూద్ కోసం ముంబై కేంద్రంగా హవాలా వ్యాపారులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించి.. ఈ సోదాలు నిర్వహించింది.
ఉగ్ర కార్యకలాపాల ద్వారా భారత దేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలపై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన 'డీ కంపెనీ' హవాలా ఆపరేటర్లు, కీలక వ్యక్తులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. భారత్‌లో దాడులు నిర్వహించేందుకు దావూద్ ఓ ప్రత్యేక బృందంను ఏర్పాటు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దేశంలో ప్రముఖ రాజకీయ నేతుల, వ్యాపారవేత్తలను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
దాడులు జరగనున్నాయన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్ఐఏ.. ఇబ్రహీం, అతడి హవాలా ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. డీ కంపెనీకి చెందిన వివిధ కార్యకలాపాలపై ప్రధానంగా దాడులు కొనసాగుతున్నాయని, రాబోయే రోజుల్లో దేశంలో అలజడి కలిగించేందుకు దావూద్ అనుచరులు స్కెచ్ వేశారని ఎన్ఐఏ తెలుసుకుంది. ఈ సమాచారంతోనే నేడు దావూద్ అనుచరుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ముంబైలోని దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. బాంద్రా, బోరివలి, పరేల్, గోరేగావ్, శాంటాక్రూజ్ తదితర ప్రాంతాల్లో దావూద్ కంపెనీకి చెందిన హవాలా ఆపరేటర్లు, డ్రగ్ స్మగ్లర్లు, రియల్ ఎస్టేట్ మేనేజర్ల ఇళ్లు, ఆఫీసులలో ఎన్‌ఐఏ తనిఖీలు జరిపింది. ఈ దాడుల్లో భాగంగా దావూద్ అనుచరుడు సలీమ్ ఫ్రూట్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. సలీమ్ ఇంట్లో కీలక పత్రాలు లభించినట్టు సమాచారం.
Also Read: MS Dhoni Bat: అందుకే ఎంఎస్ ధోనీ బ్యాట్ కొరుకుతాడు.. అసలు విషయం చెప్పేసిన అమిత్ మిశ్రా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook