New coronavirus: భారత్‌లో కొత్త రకం కరోనా..అప్పుడే 8 కేసులు

New coronavirus: కరోనా కాదిప్పుడు. కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. బ్రిటన్ నుంచి ప్రారంభమై..వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇండియాలో 8 కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఈ కొత్త కరోనా సంగతేంటో తెలుసుకుందాం..

Last Updated : Dec 22, 2020, 02:07 PM IST
  • ఇండియాలో ప్రవేశించిన కొత్త కరోనా వైరస్
  • లండన్ నుంచి ప్రారంభమై ఆస్ట్రేలియా, ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇండియాకు వ్యాప్తి
  • వీయూవీ 202012/1 గా కొత్త వైరస్ నామకరణం
New coronavirus: భారత్‌లో కొత్త రకం కరోనా..అప్పుడే 8 కేసులు

New coronavirus: కరోనా కాదిప్పుడు. కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. బ్రిటన్ నుంచి ప్రారంభమై..వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇండియాలో 8 కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఈ కొత్త కరోనా సంగతేంటో తెలుసుకుందాం..

ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ( coronavirus ) ఇప్పుడు కొత్త రూపు దాల్చి భయపెడుతోంది. కొత్త కరోనా వైరస్ ( new coronavirus ) అప్పుడే దేశాలకు విస్తరిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా బ్రిటన్ ( Britain )‌లో ముందుగా ఈ వైరస్‌ను గుర్తించారు.  వీయూఐ 202012/1 గా పిలుస్తున్న ఈ కొత్త కరోనా వైరస్..ప్రపంచ దేశాల్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. బ్రిటన్‌లో ప్రారంభమైన కొద్దిరోజులకే అప్పుడే ఈ వైరస్ అస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ ( Italy ) దేశాల్లో విస్తరించి..ఇప్పుడు  ఇండియాలో ప్రవేశించింది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణీకుల్లో ఈ కొత్త కరోనా వైరస్ వెలుగు చూసింది. 

డిసెంబర్ 21వ తేదీ రాత్రి లండన్ నుంచి ఢిల్లీ ( Delhi )కు వచ్చిన 266 మంది ప్రయాణీకుల్ని పరీక్షించగా 8 మందికి కొత్త కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది. ఈ 8 మందిలో 202012/1 లక్షణాలున్నట్టు వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 8 మందిలో.. ఢిల్లీకు చెందినవారు ఐదుగురు కాగా..కోల్‌కత్తా కు చెందినవారు ఇద్దరు, చెన్నైకు చెందినవారు ఒకరున్నారు. చెన్నైకు చెందిన బాధితుడి శాంపిల్స్‌ను పూణే ( Pune )కు పంపించారు. పూర్తి స్థాయి నివేదిక అందే వరకూ కొత్త కరోనా వైరస్‌పై అధికారికంగా చెప్పలేమన్నారు. వ్యాధి లక్షణాలు, తీవ్రతలో రెండింటికీ తేడా లేకపోయినా సంక్రమణ విషయంలో మాత్రం 70 శాతం వేగంగా విస్తరిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Also read: Tamil nadu politics: దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం ఎప్పుడో తెలుసా

Trending News