Nagaland: ఐదోసారి సీఎంగా నీఫియు రియో.. తొలి మహిళా మంత్రిగా సల్హౌతునో క్రుసె..

Nagaland CM Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి నీఫియు రియో ​​ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా క్యాబినెట్ లో తొలి మహిళా మంత్రిగా సల్హౌతునో క్రుసె ఎన్నికయ్యారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2023, 06:32 PM IST
Nagaland: ఐదోసారి సీఎంగా నీఫియు రియో.. తొలి మహిళా మంత్రిగా సల్హౌతునో క్రుసె..

Nephiu Rio Takes Oath As Nagaland CM For Fifth Term: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు నీఫియు రియో. నాగాలాండ్ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలంగా పనిచేసిన వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది. తాజాగా మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మెుత్తం 60 స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, నీఫియు రియో నేతృత్వంలోని నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ (NDPP) పార్టీలు 33 సీట్లు సాధించాయి. 2003లో రియో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇవాళే మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. 

గవర్నర్‌ లా గణేశన్‌ నీఫియు రియో చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళ ఎమ్మెల్యేతో సహా 9 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 60 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇద్దరు మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభలోకి అడుగుపెట్టారు. అందులో ఒకరైన సల్హౌతునో క్రుసె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

ప్రమాణ స్వీకారం చేసిన 9 మంది ఎమ్మెల్యేలు:  జి కైటో అయే, జాకబ్ జిమోమి, మెట్సుబో జమీర్, టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్, సిఎల్ జాన్, కెజి కెన్యే, పి పైవాంగ్ కొన్యాక్, సల్హౌటుయోనువో క్రూస్, పీ బషాంగ్‌మోంగ్బా.

Also Read: Unique Baby: రెండు గుండెలు, నాలుగు కాళ్లు, చేతులతో వింత శిశువు జననం.. పుట్టిన 20 నిమిషాలకే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News