NEET UG Result 2022 Date Declared: నీట్ యూజీ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. నీట్ యూజీ ఫలితాలను సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ఆగస్టు 30 నాటికి neet.nta.nic.in వెబ్‌సైట్‌లో ఆన్సర్ 'కీ'తో పాటు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ స్కాన్డ్ ఇమేజెస్, రికార్డెడ్ రెస్పాన్స్‌లను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆనర్సర్ కీ విడుదలయ్యాక విద్యార్థులు రికార్డెడ్ రెస్పాన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఒక్కో ఆన్సర్ 'కీ'కి రూ.200 చొప్పున, ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నీట్ ఆన్సర్ కీ ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి :
మొదట neet.nta.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోంపేజీలో 'నీట్ 2022 ఆన్సర్ కీ' లింకుపై క్లిక్ చేయాలి
ఇప్పుడు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి
అంతే స్క్రీన్‌పై ఆన్సర్ కీ డిస్‌ప్లే అవుతుంది
ఆన్సర్ కీని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఇలా తెలపాలి :
మొదట neet.nta.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
హోంపేజీలో 'నీట్ 2022 ఆన్సర్ కీ' లింకుపై క్లిక్ చేయాలి
ఇప్పుడు మీ లాగిన్ వివరాలు నమోదు చేయాలి
స్క్రీన్‌పై కనిపించే ఆన్సర్ కీలో ఏ ప్రశ్న పట్ల మీకు అభ్యంతరం ఉందో ఆ ప్రశ్నను ఎంచుకోవాలి.
ఇందుకు గాను ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.
అభ్యంతరాల కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవాలి :
మొదట neet.nta.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
హోంపేజీలో 'NEET Result 2022' లింకుపై క్లిక్ చేయాలి
అప్లికేషన్ నంబర్ సహా అవసరమైన వివరాలు నమోదు చేయాలి
అంతే స్క్రీన్‌పై ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి
నీట్ యూజీ పరీక్ష ఈ ఏడాది జూలై 17న నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 18.72 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 95 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. నీట్ పరీక్షకు 18 లక్షల దరఖాస్తులు దాటడం ఇదే తొలిసారి. ఇందులో 10.64 లక్షల మంది అమ్మాయిలే కావడం గమనార్హం. నీట్ ద్వారా విద్యార్థులు దేశంలోని ఆయా యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు.
Also Read: Telangana Rain Updates: తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్... ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన...