NEET-PG Counselling 2021: రేపటి నుంచి దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్ ధర్నా

NEET-PG Counselling 2021 latest updates: న్యూ ఢిల్లీ: రేపటి శనివారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ డాక్టర్స్ నిరసన చేపట్టాల్సిందిగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA calls for strike) పిలుపునిచ్చింది. ఔట్ పేషెంట్ విభాగంలో విధులు నిర్వర్తించే రెసిడెంట్ డాక్టర్స్ అందరూ ధర్నాలో పాల్గొనాల్సిందిగా ఫోర్డా స్పష్టంచేసింది.

Written by - Pavan | Last Updated : Nov 26, 2021, 05:14 PM IST
  • రేపటి నుంచి ధర్నాలో కూర్చోనున్న రెసిడెంట్ డాక్టర్స్
  • నీట్ పీజీ కౌన్సిలింగ్, అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యంపై Resident doctors strike
  • కేంద్రం, సుప్రీం కోర్టు స్పందించకపోతే నిరసన తీవ్రం చేస్తామని హెచ్చరిక
NEET-PG Counselling 2021: రేపటి నుంచి దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్ ధర్నా

NEET-PG Counselling 2021 latest updates: న్యూ ఢిల్లీ: రేపటి శనివారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ డాక్టర్స్ నిరసన చేపట్టాల్సిందిగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA calls for strike) పిలుపునిచ్చింది. ఔట్ పేషెంట్ విభాగంలో విధులు నిర్వర్తించే రెసిడెంట్ డాక్టర్స్ అందరూ ధర్నాలో పాల్గొనాల్సిందిగా ఫోర్డా స్పష్టంచేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ కౌన్సిలింగ్ పదే పదే వాయిదా పడుతుండటంతో కెరీర్ పై భయాందోళన పెరిగిపోతోందని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది.

నీట్ పీజీ కౌన్సిలింగ్ (NEET-PG Counselling 2021) ఇప్పటికే ఆలస్యమైందనే ఆందోళన వెంటాడుతుండగా ఇప్పటికే కౌన్సిలింగ్‌ని వాయిదా వేయడం ఏంటని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కూడా ముందు వరుసలో ఉండి కరోనా పేషెంట్లకు సేవ చేస్తున్న తమను ఇంకా ఇబ్బందులు పాలుచేయడం ఏంటని ఫోర్డా అసోసియేషన్ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. 

Also read : Mysterious Loud Boom: భారీ వింత శబ్ధంతో ఉలిక్కిపడ్డ బెంగళూరు...

దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్ ఆందోళనను దృష్టిలో పెట్టుకుని నీట్ పీజీ కౌన్సిలింగ్, అడ్మిషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీం కోర్టును వేడుకుంటున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్‌తో (Resident Doctors’ Association) చర్చల అనంతరమే తాము సమ్మె బాట పట్టినట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. 

కేంద్రం నుంచి కానీ లేదా సుప్రీం కోర్టు నుంచి కానీ సరైన స్పందన లేనట్టయితే, తమ ధర్నాను మరింత తీవ్రతరం చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA) హెచ్చరించింది. అదే కానీ జరిగితే వైద్య సేవలు స్తంభించేందుకు కారణమైన ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఫోర్డా తమ ప్రకటనలో పేర్కొంది. నీట్ పీజీ అడ్మిషన్లు, ఫీజు నిర్ణయం అంశంపై (NEET PG 2021) జరుగుతున్న విచారణను వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు (Supreme Court) ప్రకటించిన నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టంచేసింది.

Also read : Corona cases in India: మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 24 గంటల్లో 10,549 మందికి పాజిటివ్​

Also read : Rape in Uttar Pradesh: ఎస్సై పరీక్ష రాసి తిరిగొస్తుండగా.. కదులుతున్న కారులో యువతిపై రేప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News