Navajot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంచలన వ్యాఖ్యలు చేయడం లేదా వివాదానికి తెరదీయడంలో మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navajot Singh Sidhu) ఎప్పుడూ ముందుంటారు. ఈసారి మరోసారి అటువంటి వివాదానికే తెరదీశారు. అది కూడా ప్రత్యర్ధి దేశంలో పాకిస్తాన్ గడ్డపై నుంచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆజ్యం రేపుతున్నాయి.
పాకిస్తాన్ భూభాగంలోని గురుద్వార్ దర్బార్ సాహిబ్‌ను(Gurudwar Darbar Saheb)..కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా వెళ్లి నవజ్యోత్ సింగ్ సిద్ధూ దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్ధనలు చేయడమే కాకుండా ఇండియా-పాకిస్తాన్ మధ్య నూతన స్నేహ బంధాలు ఏర్పడాలని ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యం బలపడాలని కోరుకున్నారు. రెండు దేశాల మద్య పరస్పర ప్రేమను ఆశిస్తున్నట్టు చెప్పారు. కర్తార్‌పూర్ కారిడార్ తెర్చినందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన సిద్ధూ..74 ఏళ్ల క్రితం నిర్మించుకున్న అడ్డుగోడుల్ని తొలగించుకోవల్సిన అవసరముందన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్(Imran Khan)తనకు పెద్దన్న అని..తనకు గొప్ప గౌరవం, ప్రేమ లభించిందంటూ సిద్ధూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వివాదం రేపుతున్నాయి.
కర్తార్‌పూర్ కారిడార్(Kartarpur Corridor) అధికారిని ఆలింగనం చేసుకున్న సిద్ధూ..ఇమ్రాన్ ఖాన్‌ను పెద్దన్నగా అభివర్ణించిన వీడియోను బీజేపీ సీనియర్ నేత ఒకరు ట్విట్టర్‌లో షేర్ చేశారు. సిద్ధూ గతంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ బజ్వాను ఆలింగనం చేసుకుని..ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. సిద్ధూ వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు సన్నిహితుడిగా ఉన్న సిద్దూ..పాక్ నేతల్ని పొగడటం ఆశ్చర్యం కాదని బీజేపీ చెబుతోంది. పాకిస్తాన్..దేశంలో పంజాబ్‌లో ద్రోన్ల సహాయంతో ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని పంపిస్తోందని బీజేపీ నేత మాళవియా విమర్శించారు. ఆ దేశానికి చెందిన ప్రధానిని ప్రశంసించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. నవజ్యోతి సింగ్ సిద్ధూ వ్యాఖ్యలు ఆందోళన రేపుతున్నాయని బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. కర్తార్‌పూర్ కారిడార్ సందర్శన ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి.
Also read: తమిళనాడు: లైంగిక వేధింపులు తాళలేక.. బాలిక బలవన్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook