NEET UG 2024 Row: NEET UG 2024 పరీక్ష ఫలితాల్లో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. గ్రేస్ మార్కుల విధానంలో కుంభకోణం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ఇప్పుుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించింది.
నీట్ యూజీ 2024 ఫలితాల వివాదం రోజురోజుకూ పెద్దదవుతోంది. నిబంధనల ప్రకారం నీట్ ఫలితాల్లో పూర్తిగా ఫుల్ మార్కులు లేదంటే తరువాత స్థానంలో 715 మార్కులు వస్తాయి. ఎందుకంటే ఒక్కో ప్రశ్నకు 4 మార్కులుంటాయి. ఏదైనా ప్రశ్న తప్పుగా రాస్తే 1 మార్క్ మైనస్ అవుతుంది. అంటే ఐదు మార్కులు పోయి 715 అవుతుంది. అదే 1 ప్రశ్నకు సమాధానం తెలియక వదిలేస్తే 716 మార్కులు వస్తాయి. అంతే తప్పు 718, 719 మార్కులనేవి ఉండవు. కానీ ఈసారి ఫలితాల్లో నిబంధనలకు విరుద్ధంగా 718, 719 మార్కులు రావడమే కాకుండా ఒకే పరీక్షా కేంద్రంలో ఆరుగురితో పాటు మొత్తం 67 మందికి ఒకే టాప్ ర్యాంక్ రావడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. దీనికి సమాధానంగా గ్రేస్ మార్కులు కొంతమందికి కలపడం వల్ల అలా వచ్చాయని ఎన్టీయే ఇచ్చిన సమాధానంపై కూడా వివాదం రేగింది. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమౌతోంది.
ఈ నిరసనల నేపధ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించింది. గ్రేస్ మార్కులు పొందిన 15 వందల మందికి పైగా అభ్యర్ధుల విషయంలో సమీక్షించేందుకు నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటైందని ఎన్టీయే వెల్లడించింది. కమిటీ అధ్యయనం తరువాత 1500 మంది విద్యార్ధుల ఫలితాలను సవరించే అవకాశముందని ఎన్టీఏ స్పష్టం చేసింది. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ నేతృత్వంలోని కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. గ్రేస్ మార్కుల వల్ల పరీక్ష అర్హత ప్రమాణాలపై ప్రభావం పడదని ఎన్టీయే చెబుతోంది.
అసలు కొందరు విద్యార్ధులకు గ్రేస్ మార్కులు కలపడంపై నీట్ 2024 విద్యార్ధులు మండిపడుతున్నారు. ఆరు కేంద్రాల్లో దాదాపు 1600 మంది విద్యార్ధుల టైమ్ లాస్ వివరాలు పరిశీలించి గతంలో అనుసరించిన విధానాలు, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా గ్రేస్ మార్కులు ఇచ్చినట్టుగా ఎన్టీయే చెబుతోంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
Also read: Monsoon Rains Alert: రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook