Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ఎన్‌ఐఏ రివార్డు... ఆచూకీ చెబితే రూ.25 లక్షలు..

NIA Reward on Dawood Ibrahim: ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై ఎన్ఐఏ రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 1, 2022, 01:48 PM IST
  • అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ఎన్‌ఐఏ రివార్డు
  • ఆచూకీ చెబితే రూ.25 లక్షలు
  • దావూద్ అనుచరులపై రూ.15 లక్షల రివార్డు
Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ఎన్‌ఐఏ రివార్డు... ఆచూకీ చెబితే రూ.25 లక్షలు..

NIA Reward on Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. దావూద్ ఇబ్రహీంను పట్టించే ఏ సమాచారమిచ్చినా రివార్డు అందజేస్తామని తెలిపింది. దావూద్ ఇబ్రహీంతో పాటు అతని అనుచరులైన చోటా షకీల్‌పై రూ.20 లక్షలు, హజీ అనీస్‌, జావెద్ పటేల్‌, ఇబ్రహీం ముస్తాక్, అబ్దుల్ రజాక్, టైగర్ మొమన్‌పై రూ.15 లక్షలు చొప్పున రివార్డు ప్రకటించింది. దావూద్‌తో పాటు ఈ అందరూ ముంబై పేలుళ్లతో సంబంధమున్నవారే కావడం గమనార్హం.

దావూద్ ఇబ్రహీంను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. దావూద్‌కి చెందిన డీ కంపెనీ ఆయుధాల స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం, అండర్ వరల్డ్ క్రిమినల్ కార్యకలాపాలు, మనీ లాండరింగ్, నకిలీ నోట్ల చలామణి, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఐరాస వెల్లడించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు డీ కంపెనీ క్రియాశీలక సహకారం అందిస్తోందని తెలిపింది.

దావూద్ డీ కంపెనీ ఇండియాలోనూ ఈ రకమైన నేర కార్యకలాపాలకు ఇక్కడ కూడా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసిందనే అభియోగాలతో ఎన్ఐఏ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులపై రివార్డును ప్రకటించింది. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి అయిన దావూద్ ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. 1993లో జరిగిన ముంబై పేలుళ్ల ఘటనలో దాదాపు 257 మంది మృతి చెందగా దాదాపు 1400 మంది గాయపడ్డారు. 

Also Read: LPG Cylinder Price: ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన ధర...  

Also Read: King Cobra Video: ఆ కారు యజమానికి దడ పుట్టించిన కింగ్ కోబ్రా.. వారం రోజులకు పైగా వాహనంలోనే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News