ముఖ్యమంత్రి విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

160 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 

Last Updated : Jan 20, 2018, 12:28 PM IST
ముఖ్యమంత్రి విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ నుంచి గౌహతి మీదుగా ఇంఫాల్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 160 మందితో శుక్రవారం ఢిల్లీ నుంచి ఇంఫాల్‌కి బయల్దేరిన విమానం మార్గం మధ్యలో గౌహతి విమానాశ్రయంలో దిగుతున్న క్రమంలోనే ఓ పక్షిని తాకింది. అదృష్టవశాత్తుగా విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులకి ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగలేదు. ఇదే విమానంలో ఇంఫాల్ వెళ్తున్న మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ కూడా వున్నారు. 

పక్షిని ఢీకొన్న ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియా విమానం గౌహతి విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. దీంతో అక్కడి నుంచి ఇంఫాల్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అదే విమానంలో ప్రయాణిస్తున్న మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ ట్విటర్ ద్వారా ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా గౌహతిలో ఎయిర్ ఇండియా సేవలు అత్యంత అధ్వాన్నంగా వున్నాయని, ఇంఫాల్ వెళ్లాల్సిన ప్రయాణికులకి ఆహారం కూడా అందించకుండా గంటల తరబడి అందులోనే కూర్చొబెట్టారని ఎయిర్ ఇండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు బిరెన్ సింగ్. శనివారం మధ్యాహ్నం వరకు మరో విమానం కూడా లేదని ఎయిర్ ఇండియా సిబ్బంది బదులిచ్చినట్టుగా సీఎం బిరెన్ సింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Trending News