గ్యాంగ్ రేప్... 1000 మంది పోలీసుల ఉరుకులు, పరుగులు... చివరికి షాకింగ్ ట్విస్ట్

Nagpur girl cooks up gang rape story: నాగపూర్‌కి చెందిన ఓ యువతి ఫేక్ గ్యాంగ్ రేప్ స్టోరీ అల్లి కొద్ది గంటల పాటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. దాదాపు ఆరు గంటల పాటు పోలీసులు అంతటా గాలించినా, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఎక్కడా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో పోలీసులు యువతిని మరోసారి ప్రశ్నించగా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 01:42 PM IST
  • గ్యాంగ్ రేప్... 1000 మంది పోలీసుల ఉరుకులు, పరుగులు... చివరికి షాకింగ్ ట్విస్ట్
  • నాగపూర్‌లో సంచలనం రేకెత్తించిన యువతి గ్యాంగ్ రేప్ ఫిర్యాదు
  • తనపై ఇద్దరు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని యువతి ఫిర్యాదు
  • పోలీసుల ఉరుకులు, పరుగులు... ఎక్కడా దొరకని క్లూ, చివరలో షాకింగ్ ట్విస్ట్
గ్యాంగ్ రేప్... 1000 మంది పోలీసుల ఉరుకులు, పరుగులు... చివరికి షాకింగ్ ట్విస్ట్

Nagpur girl cooks up gang rape story: మహారాష్ట్రలోని (Maharashtra) నాగపూర్‌కి చెందిన ఓ యువతి ఫేక్ గ్యాంగ్ రేప్ (Gang rape) స్టోరీ అల్లి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. దాదాపు 1000 మందితో కూడిన 40 పోలీస్ బృందాలు ఆరు గంటల పాటు ఈ కేసును చేధించేందుకు శ్రమించారు. ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులకు యువతిపై అనుమానం కలిగింది. దీంతో మరోసారి యువతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి కోసమే ఈ కట్టు కథ అల్లినట్లు అంగీకరించింది.

వివరాల్లోకి వెళ్తే... నాగపూర్‌లోని (Nagpur) కాలమ్న పోలీస్ స్టేషన్‌కు సోమవారం (డిసెంబర్ 13) ఉదయం 11గం. సమయంలో ఓ యువతి (19) వచ్చింది. చిఖాలి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తనపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాందాస్ పేట్‌లోని మ్యూజిక్ ఇనిస్టిట్యూట్‌కి వెళ్తుండగా ఓ వ్యానులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తనను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారని ఫిర్యాదులో పేర్కొంది. ఆపై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. బుతిబోరి ప్రాంతానికి ఎలా వెళ్లాలో చెప్పాలని మొదట ఆ ఇద్దరు తనను కోరారని... ఆ వెంటనే బలవంతంగా వాహనంలోకి ఎక్కించారని చెప్పింది.

యువతి ఫిర్యాదుతో (Viral news) నాగపూర్ కమిషనర్ సునీల్ ఫులారి వెంటనే 40 పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. యువతి చెప్పిన ఆధారాలతో నిందితుల కోసం అంతటా గాలించారు. దాదాపు 50 మంది వ్యక్తులను విచారించారు. నగరంలోని దాదాపు 250 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కానీ ఎక్కడా ఏ ఎలాంటి ఆధారం లభించలేదు. ఆరు గంటలు గడిచినా ఎక్కడా ఏ చిన్నా ఆధారం దొరక్కపోవడంతో పోలీసులకు యువతిపై అనుమానం వచ్చింది. దీంతో మరోసారి యువతిని ప్రశ్నించగా... అదంతా కట్టు కథ అని బాంబు పేల్చింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి కోసమే కట్టు కథ అల్లాల్సి వచ్చినట్లు తెలిపింది. యువతి చెప్పింది విని పోలీసులు షాక్ తిన్నారు.

Also Read: పాల బుగ్గలతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News