ముకేశ్ అంబానీకి ప్రపంచ స్థాయి గుర్తింపు

    

Last Updated : Apr 20, 2018, 12:17 PM IST
ముకేశ్ అంబానీకి ప్రపంచ స్థాయి గుర్తింపు

రిలయన్స్ గ్రూప్ అధినేత, అపర కుబేరుడు  ముకేశ్‌ అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ గొప్ప నేతల జాబితాలో ముకేశ్‌ అంబానీ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ స్థాయి ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ 50 మందితో ఈ జాబితాను  రూపొందించగా అందులో ముకేశ్‌కు 24వ స్థానం లభించింది.   అత్యధిక వేగం మొబైల్‌ డేటాను.. కేవలం  రెండేళ్లలోనే సామాన్యుల దరి చేర్చి టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని ముకేశ్ అంబానీపై ఫార్చ్యూన్‌ మ్యాగజైన్ ప్రసంశల జల్లు కురిపించింది.

ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ టాప్ 10 జాబితాలో బిల్‌, మిలిందా గేట్స్‌  టెన్నిస్‌ స్టార్‌ సెరీనా విలియమ్స్‌,  బ్లాక్‌రాక్‌ అధిపతి లారీ ఫింక్‌, జనరల్‌ మోటార్స్‌ సీఈఓ మేరే బర్రా, టెన్సెంట్‌ సీఈఓ హటెంక్‌, సేల్స్‌ ఫోర్స్‌ సీఈఓ మార్క్‌ బెనీఫ్‌, జేపీ మోర్గాన్‌చేస్‌ సీఈఓ జామీ డిమన్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌ సీఈఓ ఎడ్‌ బాస్టిన్‌ తదితరులు ఉన్నారు.

Trending News