Good News: మారటోరియం గడువు మరో రెండేళ్లు పొడిగింపు..!

కరోనా (Coronavirus) లాక్‌డౌన్ విపత్కర పరిస్థితుల నాటినుంచి సాధారణ ప్రజలతోపాటు.. సంస్థలు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మార్చి నుంచి దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే.

Last Updated : Sep 1, 2020, 01:11 PM IST
Good News: మారటోరియం గడువు మరో రెండేళ్లు పొడిగింపు..!

Moratorium period on loan repayment extendable by two years: న్యూఢిల్లీ: కరోనా (Coronavirus) లాక్‌డౌన్ విపత్కర పరిస్థితుల నాటినుంచి సాధారణ ప్రజలతోపాటు.. సంస్థలు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మార్చి నుంచి దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ( Supreme Court  ) మంగళవారం విచారణ చేపట్టింది. అయితే.. కేంద్రం, ఆర్బీఐ అన్ని లోన్లపై రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో ఉన్నట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా... సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు ప్రారంభించిందని.. అయితే మార్చి 2021 వరకు మారటోరియం గడువును పెంచేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. చెల్లించని ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ గానీ, పెనాల్టీ గానీ విధించకూడదని ప్రభుత్వానికి ఆదేశించింది. అయితే ఈ కేసుపై రేపు (బుధవారం) పూర్తిస్థాయిలో వాదనలు వింటామని సర్వోన్నత ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.  Also read: Parliament Monsoon Session: 14 నుంచే పార్లమెంట్

ఇదిలాఉంటే.. ఆగస్ట్‌ 31తో ముగియనున్న మారటోరియం గడువును కరోనా పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్‌ 31 వరకు పొడించాలని కోరుతూ న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా కారణంగా అందరూ ఆర్థికంగా కూరుకుపోయారని.. మారిటోరియం గడువును పెంచాలని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు. ఈ క్రమంలో అన్ని రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం పొడిగిస్తామని కేంద్రం చెప్పడంతో అందరికీ ఉపశమనం లభించినట్లయిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.   Also read: Pranab Mukherjee in criticism: కాంగ్రెస్‌కి కోపం తెప్పించిన ప్రణబ్ ముఖర్జీ

Trending News