Kunwar Sarvesh Singh: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి మృతితో బీజేపీలో, అతడు పోటీ చేసే లోక్‌సభ నియోజకవర్గంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కున్వర్ సర్వేశ్ సింగ్ (71) ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు.
Also Read: Cyber Crime: సైబర్ నేరగాళ్లకు మరో ప్రాణం బలి.. 20 ఏళ్లకే నిండిన నిండు నూరేళ్లు
చికిత్స పొందుతున్న సర్వేశ్ సింగ్ ఆరోగ్యం విషమించి శనివారం మృతిచెందారు. ఈ విషయాన్ని ఆ పార్టీ యూపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి వెల్లడించారు. గొంతు సమస్యతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం శస్త్ర చికిత్స చేశారు. కోలుకుంటున్న సమయంలోనే ఆయన మృతి చెందడం బాధాకరమని తెలిపారు. అయితే సర్వేశ్ కుమార్ పోటీ చేస్తున్న మొరదాబాద్ ఎంపీ స్థానానికి మొదటి దశలో ఎన్నిక పూర్తయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read: Doordarshan Logo: ఛానల్ రంగు మార్చడం అన్యాయం, దుర్మార్గం: మమతా బెనర్జీ షాక్
ప్రముఖుల సంతాపం
ఎంపీ అభ్యర్థి కున్వార్ సర్వేశ్ సింగ్ మృతితో బీజేపీలో తీవ్ర విషాదం అలుముకుంది. అతడి మృతికి బీజేపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అగ్ర నాయకులు సంతాపం తెలిపారు. అతడి మృతితో ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి దాకా ఎన్నికల్లో హుషారుగా ఉన్న వ్యక్తి మరణించడంతో ఆయన వర్గం తీవ్ర విషాదంలో మునిగారు.
తొలిసారి పోటీ
వ్యాపారవేత్త అయిన సర్వేశ్ సింగ్ రాజకీయాల్లోకి వచ్చారు. థకూర్‌ద్వారా అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సర్వేశ్ సింగ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. తాజాగా అతడి బీజేపీ మొరదాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. కాగా ఆయన కుమారుడు సుశాంత్ సింగ్ బాదాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఎన్నికలు ముగిశాక ఆయన మరణించడంతో మోరదాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మళ్లీ ఎన్నిక జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter