MLA KR Ramesh Kumar: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై (KR Ramesh Kumar controversial comments) క్షమాపణ కోరారు. తాను నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. తన మాటల ఉద్దేశం వేరేనని చెప్పారు. ఇకపై తాను మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త (MLA KR Ramesh Kumar coments in Assembly) తీసుకుంటానని చెప్పారు.
I would like to express my sincere apologies to everyone for the indifferent and negligent comment I made in today’s assembly about “Rape!” My intention was not trivialise or make light of the heinous crime, but an off the cuff remark! I will choose my words carefully henceforth!
— K. R. Ramesh Kumar (@KRRameshKumar1) December 16, 2021
ఇంతకి ఆయన ఏమన్నారంటే..
అత్యాచారం నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడితే.. దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమమంటూ గురువారం అసెంబ్లీలో (Rape remark) వ్యాఖ్యానించారు రమేశ్ కుమార్.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. గురువారం చర్చ పొడగింపునకు ఎమ్మెల్యేలు స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరీపై ఒత్తిడి చేశారు. ఎమ్మెల్యేలు గందరగోళాన్ని అదుపు చేయండం స్పీకర్ వల్ల కాలేదు. దీనితో విసుగెత్తి పోయిన ఆయన.. నా పరిస్థితి ఎలా ఉందంటే.. అన్నింటిని అస్వాదీస్తూ అవును.. అంటూ ఉండాల్సి వస్తోంది అని చెప్పుకొచ్చారు. నవ్వుతూ ఈ విధంగా ఎమ్మెల్యేల తీరుపై స్పందిచారు స్పీకర్.
స్పీకర్ మాటలను అందుకున్న ఎమ్మెల్యే రమేశ్ కుమార్ 'అత్యాచారం అనివార్యమైనప్పుడు.. దానిని ఆనందంగా ఆస్వాదించడమే మేలు' అనే సామేతలానే ఇప్పుడు మీ పరిస్థితి ఉందంటూ (MLA KR Ramesh Kumar Rape remark) వ్యాఖ్యానించారు.
విమమర్శలు..
అయితే ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సమాజంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎమిటంటూ.. విమర్శలు గుప్పించారు పలువురు. ఈ నేపథ్యంలోనే రమేశ్ కుమార్ తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు.
మీడియాతో మాట్లాడేందుకు ససేమిరా..
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించగా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు.
#WATCH | Bengaluru: Karnataka Congress MLA Ramesh Kumar evades reporters' questions on if he will apologise for his 'rape' remark made in the state Assembly, yesterday. pic.twitter.com/kUS1IVnIUx
— ANI (@ANI) December 17, 2021
Also read: Bengal Woman Shoots Boyfriend ప్రేమించిన వ్యక్తిపై యువతి కాల్పులు- తనను పట్టించుకోవడం లేదని..
Also read: Corona cases in India: దేశంలో తగ్గిన కరోనా కేసులు- మరణాల్లో స్వల్ప వృద్ధి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook