కోయంబత్తూరు : సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing )... కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ఔషదం కంటే అతి ముఖ్యమైనది. ఇక మన జీవితాల్లో ఒక భాగం కావాల్సింది. కానీ కారణాలేవైనా అక్కడక్కడా ఆ సోషల్ డిస్టన్సింగ్ అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. అటువంటి దృశ్యమే ఒకటి తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో ( Coimbatore in TamilNadu) కనిపించింది. ఇది కేవలం కోయంబత్తూరులోనే కాదు.. దేశం నలమూలల ఇటువంటి దృశ్యాలే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చిక్కుకుపోయిన వలసకూలీలను ( Migrant workers ) స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను ( Shramik special trains ) నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోయంబత్తూర్‌లోని సుందరాపురంలో ఉన్న వలసకూలీలు ఉత్తర్ ప్రదేశ్, బీహార్‌లోని తమ సొంతూళ్లకు వెళ్లేందుకు అవసరమైన ట్రెయిన్ పాసులను ( Train passes ) తీసుకునేందుకు గుమిగూడినప్పుడు కెమెరాకు చిక్కిని దృశ్యం ఇది. ( Also read : Lockdown: రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. )
#WATCH Tamil Nadu: Migrant workers gather in large numbers at Sundarapuram, Coimbatore to collect train passes for today's 'shramik special' trains for Uttar Pradesh & Bihar. pic.twitter.com/49tG73eNUz
— ANI (@ANI) May 20, 2020
లాక్ డౌన్ ( Lockdown ) నేపథ్యంలో పనులు కరువవడంతో సొంతూళ్లకు వెళ్లిపోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వలస కూలీలు.. అందులో అడ్డం వచ్చిన ఏ కష్టాన్ని, ఏ నిబంధనను లెక్క చేయడం లేదని చెప్పడానికి ఈ దృశ్యాన్ని ఒక నిదర్శనంగానూ చెప్పుకోవచ్చు. (Also read : కరోనాతో తెలంగాణలో మరో నలుగురు మృతి )
ఇదిలావుంటే, మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 1,565 శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ద్వారా 20 లక్షలకుపైగా రైలు ప్రయాణికులను ( Train passengers ) వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) ప్రకటించింది. మరోవైపు అంఫాన్ తుఫాన్ (Cyclone Amphan ) కారణంగా వెస్ట్ బెంగాల్ ( West Bengal ) వైపు వెళ్లే పలు శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే వెల్లడించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
సోషల్ డిస్టన్సింగ్ లేదు.. రైలు ఎక్కాలనే ఆందోళన తప్ప