Meghalaya Denied Permission For Pm Modi Rally: ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి మేఘాలయ ప్రభుత్వం నిరాకరించింది. పశ్చిమ గారో హిల్స్ జిల్లాలోని తురాలోని పీఏ సంగ్మా స్టేడియంను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాన్ని బీజేపీ కోరగా.. ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ ఎన్నికల ర్యాలీ ఫిబ్రవరి 24న జరగాల్సి ఉంది. బీజేపీ ర్యాలీకి అనుమతి కోరుతున్న చోటే పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తురా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ర్యాలీ, భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేయగా.. ప్రభుతం పర్మిషన్ ఇవ్వలేదు. పీఎ సంగ్మా స్టేడియంలో పనులు జరుగుతున్నాయని చెబుతూ బీజేపీ అభ్యర్థనను మేఘాలయ క్రీడా శాఖ తిరస్కరించింది.
ప్రధాని మోదీ ర్యాలీకి, సభకు అనుమతి ఇవ్వకపోవడంతో మేఘాలయ ప్రభుత్వం బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గతేడాది డిసెంబర్ 16నే ముఖ్యమంత్రి ఈ స్టేడియాన్ని ప్రారంభించారని.. పనులు పూర్తి కాకుండానే ఎలా ప్రారంభించారంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అనుమతి నిరాకరించారంటూ ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ మేఘాలయ ప్రజలతో మాట్లాడాలనుకుంటే ఎవరూ అడ్డుకోలేరని.. షెడ్యూల్ ప్రకారమే ర్యాలీ జరుగుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల జాయింట్ ఇన్‌చార్జి రితురాజ్ సిన్హా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీకి భారీగా జనం రావడంతో మేఘాలయ ప్రభుత్వం భయపడుతోందన్నారు.
మేఘలయా అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనుండగా.. మార్చి 2న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయా పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్, యూడీపీ తదితర పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో మేఘాలయ ప్రజలు బీజేపీని దారుణంగా తిరస్కరించారు. ఆ పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి
Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి