Manmohan Singh health condition : నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం

Manmohan Singh's condition stable: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్‌ సింగ్‌ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 11:46 AM IST
  • మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన ఎయిమ్స్
  • ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా
  • మన్మోహన్‌ సింగ్‌ కోలుకోవాలంటూ మోదీ ట్వీట్
Manmohan Singh health condition : నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం

Manmohan Singh's condition stable, under observation, say AIIMS doctors: మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో (AIIMS) చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు గురువారం హెల్త్‌ బులిటెన్‌ (health bulletin) విడుదల చేశారు. మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందంటూ డాక్టర్లు చెప్పారు. బుధవారం ఆయన అస్వస్థతకు గురవడంతో ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. 

ఆస్పత్రిలో చేరక ముందు రెండ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడ్డారు. ఇక ఈ ఏడాది కొవిడ్‌ (Covid) రెండో వేవ్‌ సమయంలోనూ మన్మోహన్‌కు కరోనా (corona) పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దాంతో అప్పట్లో కూడా ఆయన ఆస్పత్రిలో చేరారు.

Also Read : Bride Wears 60 Kgs Gold : అరవై కేజీల బంగారంలా మారిన పెళ్లి కూతురు

ఇక కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. (PM Narendra Modi) మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

 

Also Read : AP Theatres : ఏపీ థియేటర్లలో వందశాతం సీటింగ్‌కు అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News