Manmohan Singh health condition: మన్మోహన్ సింగ్‌కి డెంగ్యూ.. తాజా పరిస్థితిపై AIIMS ప్రకటన

Manmohan Singh health condition live updates: ఇదే ఏడాది ఏప్రిల్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మన్మోహన్ సింగ్ కొవిడ్-19 బారిన పడ్డారు. అదృష్టవశాత్తుగా ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ఇదే ఎయిమ్స్ ఆస్పత్రి (Delhi AIIMS) నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2021, 01:03 AM IST
  • మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి డెంగ్యూ ఎటాక్
  • ప్లేట్‌లెట్స్ సంఖ్య (Platelets count) పై స్పందించిన ఢిల్లీ ఎయిమ్స్
  • మన్మోహన్ సింగ్ హెల్త్ లేటెస్ట్ అప్‌డేట్స్ (Manmohan Singh health live updates)
Manmohan Singh health condition: మన్మోహన్ సింగ్‌కి డెంగ్యూ.. తాజా పరిస్థితిపై AIIMS ప్రకటన

Manmohan Singh health condition live updates: న్యూ ఢిల్లీ: అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కి డెంగ్యూ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. మన్మోహన్ సింగ్ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యుల బృందం స్పందిస్తూ.. ఆయనకు డెంగ్యూ నిర్ధారణ అయిందని, అయితే అదృష్టవశాత్తుగా క్రమక్రమంగా ఆయన కోలుకుంటున్నారని తెలిపారు.

ప్రస్తుతానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్లేట్​లెట్స్ కౌంట్ (Platelets count) పెరుగుతోంది కనుక ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఎయిమ్స్ హాస్పిటల్లోని కార్డియో న్యూరో సెంటర్​లోని ప్రైవేట్ వార్డులో మన్మోహన్ సింగ్‌కి​ చికిత్స అందిస్తున్నారు. 

జ్వరం, నీరసంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్‌ని బుధవారం సాయంత్రం చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కి తరలించారు. అప్పటి నుంచి ఆయన నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ నితిష్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ (Union Health Minister Mansukh Mandaviya) నేరుగా ఎయిమ్స్‌కి వెళ్లి మన్మోహన్ సింగ్‌ని కలిసి పరామర్శించారు.

Also read : Mothkupalli Narsimhulu: టీఆర్ఎస్‌లో మోత్కుపల్లి చేరికకు తేదీ, ముహూర్తం ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా అత్యున్నత స్థాయి ప్రముఖులు ఎంతో మంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh health live updates) త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు సామాజిక మాథ్యమాల ద్వారా తమ అభిలాషను వ్యక్తపరిచారు. 

ఇదే ఏడాది ఏప్రిల్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మన్మోహన్ సింగ్ కొవిడ్-19 బారిన పడ్డారు (Manmohan Singh tested positive for COVID-19). అదృష్టవశాత్తుగా ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ఇదే ఎయిమ్స్ ఆస్పత్రి (Delhi AIIMS) నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

Also read : Srireddy on Samantha issue: సమంత ఫ్యాషన్ స్టైలిస్ట్ preetham jukalker పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also read : Girl dancing on railway platform: రైల్వే స్టేషన్‌లో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News