రోడ్డుపైనే మంటల్లో కాలి బూడిదైన కారు.. డ్రైవర్ సజీవ దహనం!

అగ్ని ప్రమాదంలో కారులోనే కాలిబూడిదైన డ్రైవర్ 

Last Updated : Aug 11, 2018, 07:51 PM IST
రోడ్డుపైనే మంటల్లో కాలి బూడిదైన కారు.. డ్రైవర్ సజీవ దహనం!

ప్రయాణిస్తున్న కారుకి అకస్మాత్తుగా మంటలు అంటుకుని, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఆ మంటల్లోనే  కాలి బూడిదైన దుర్ఘటన ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌కి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాకా(శనివారం తెల్లవారుజామున) 1:50 గంటల సమయంలో చోటుచేసుకుంది. అంబేద్కర్ నగర్‌కి సమీపంలో రోడ్డుపై ఓ కారుకి నిప్పంటుకున్నట్టుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పినట్టు ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు. తాము అక్కడికి చేరుకునేలోపే వాహనం కాలిబూడిదైందని అగ్నిమాపక శాఖ సిబ్బంది స్పష్టంచేశారు. అంకిత చక్రవర్తి అనే ట్విటర్ యూజర్ ట్విటర్ ఈ దుర్ఘటనకు సంబంధించిన లైవ్ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనంలో కాలిబూడిదైన వ్యక్తి పేపర్లు తీసుకెళ్తున్నట్టు అధికారులు గుర్తించారు. బహుషా కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో మరో వాహనాన్ని ఢీకొట్టి ఉండవచ్చని, అదే ఈ అగ్ని ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Trending News