West Bengal Assembly Elections Results: పశ్చిమ బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీ ఆశలు నెరవేరలేదు. బెంగాల్ కూతురే కావాలని ప్రజలు కోరుకున్నారు. ముచ్చటగా మూడోసారి దీదీ ప్రభుత్వం కొలువు దీరబోతోంది.
దేశమంతా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల (West Bengal Assembly Elections)వైపు చూసింది. ఆసక్తి కల్గించిన ఎన్నికల్లో మమతా బెనర్జీ మరోసారి విజయకేతనం ఎగురవేశారు. బెంగాల్‌లో 2 వందల సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ..84 సీట్లు దాటడం లేదు. అటు 205 సీట్ల వరకూ గెల్చుకుని ముచ్చటగా మూడోసారి మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతూనే తృణమూల్ కాంగ్రెస్ పుంజుకోవడం ప్రారంభమైంది. మధ్యాహ్నమవుతూనే సత్తా చూపించింది. 2016 ఎన్నికల ఫలితాల్ని పార్టీ రిపీట్ చేసింది. పశ్చిమ బెంగాల్ ( West Bengal) ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ( Prasanth Kishor) చెప్పినట్టే టీఎంసీ ( TMC) 2 వందల సీట్లు దాటింది. బీజేపీ(Bjp)వంద సీట్లు దాటలేదు. 2016లో టీఎంసీ 211 సీట్లలో విజయం సాధించి అధికారం చేపట్టింది. ఇప్పుడు కూడా ఇంచుమించు అవే ఫలితాలు వెలువడుతున్నాయి.
అయితే నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం..సమీప బీజేపీ అభ్యర్ధి, టీఎంసీ మాజీ కీలక నేత సువేందు అధికారి చేతిలో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. తొలుత 8 వేల ఓట్లు తేడాతో వెనుకబడిన మమతా బెనర్జీ తరువాత మళ్లీ పుంజుకున్నారు.16వ రౌండ్ ముగిసేసరికి 820 ఓట్ల స్వల్ప మెజార్టీతో నిలిచారు. దాంతో చివరిదైన 17వ రౌండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. చివరికి సువేందు అధికారిపై 12 వందల ఓట్ల తేడాతో మమతా విజయం సాధించారు. రాష్ట్రమంతా టీఎంసీకు అనుకూలంగా ఉన్నా..నందిగ్రామ్‌లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగానే ఉంది. నందిగ్రామ్‌లో సువేందు అధికారికి ఉన్న పట్టు ఏపాటిదో ఈ ఫలితాన్ని బట్టి తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రముఖ నేతలు బాబుల్ సుప్రియో, లార్కిట్ చటర్జీలు వెనుకంజలో ఉన్నారు.
Also read: India Corona Update: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, 4 లక్షలకు చేరువలో కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook