Ajit Pawar to Join Eknath Shinde Govt: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకోవడం ఆస్తకికరంగా మారింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా రాజ్‌భరవ్‌ను చేరుకోవడంతో అజిత్ పవార్ అధికార పక్షానికి మద్దతు ఇస్తారని ప్రచారం జరగుతోంది. ఆయనను డిప్యూటీ సీఎం చేస్తారనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. షిండే కేబినెట్‌లో అజిత్‌పవార్‌కు మద్దతుగా ఉన్న 9 మంది ఎమ్మెల్యేలను కూడా మంత్రులుగా అవకాశం లభించనుందని వార్తలు వస్తున్నాయి. రాజ్‌భవన్‌కు చేరుకున్న అజిత్ పవార్.. అక్కడ గవర్నర్‌ను కలిసి తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
ఆదివారం తన నివాసంలో మద్దతు ఎమ్మెల్యేలతో సమావేశమై అనంతరం రాజ్‌భవన్‌కు బయలుదేరారు. ఈ సమావేశానికి ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ కూడా హాజరయ్యారు. అయితే సూలే మధ్యలో నుంచే వెళ్లిపోయారు. వీరిద్దని ఇటీవలె వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన విషయం తెలిసిందే. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 29 మంది అజిత్ పవార్‌కు మద్దతుగా ఉన్నారు. ప్రతిపక్ష నేత పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. సీఎంతో పాటు పాటు కొందరు బీజేపీ మంత్రులు కూడా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అజిత్ పవార్‌తోపాటు ఛగన్ భుజబల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం.
ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు ఇవ్వకపోవడంపై అజిత్ పవర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూణేలో ఉన్న ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్‌తో ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఫోన్‌లో మాట్లాడారు. రాజకీయ పరిణామాల దృష్ట్యా.. శరద్ పవార్ పూణేలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని తాజా రాజకీయ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అజిత్ పవార్ ఇంట్లో జరిగిన సమావేశం గురించి తనకు తెలియదని శరద్ పవార్ చెప్పారు. అజిత్ పవార్ ప్రతిపక్ష నేత కావడంతో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయవచ్చని.. తనకు సమాచారం లేదని తెలిపారు. రాజ్‌భవన్‌లో ఎమ్మెల్యేలతో సందడి నెలకొనగా.. బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతల సమావేశం జరుగుతోంది.
Also Read: West Indies Team: పసికూనల చేతిలో పరాజయం.. వరల్డ్ కప్ రేసు నుంచి విండీస్ ఔట్
Also Read: Karnataka Snake Video: చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచిన వ్యక్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి