Maharashtra Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బలనిరూపణ ఎప్పుడు, గవర్నర్ ఏమంటున్నారు

Maharashtra Crisis: మహారాష్ట్ర సంక్షోభంపై అప్‌డేట్ వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవల్సిన సమయం వచ్చేసిందా.. జూన్ 30లోగా బలపరీక్షకు సిద్ధం కావాలని రాష్ట్ర గవర్నర్ ఆదేశించారా..ఆ వివరాలివే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 28, 2022, 11:14 PM IST
Maharashtra Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బలనిరూపణ ఎప్పుడు, గవర్నర్ ఏమంటున్నారు

Maharashtra Crisis: మహారాష్ట్ర సంక్షోభంపై అప్‌డేట్ వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవల్సిన సమయం వచ్చేసిందా.. జూన్ 30లోగా బలపరీక్షకు సిద్ధం కావాలని రాష్ట్ర గవర్నర్ ఆదేశించారా..ఆ వివరాలివే..

మహారాష్ట్ర ప్రభుత్వ సంక్షోభం ఇంకా కొలిక్కిరాలేదు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, మంత్రుల నిరసన కొనసాగుతోంది. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వ బలపరీక్షకు సిద్ధమవ్వాలనే వార్తలు వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించి మహారాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి ఓ లేఖ విపరీతంగా వైరల్ అవుతోంది. జూన్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బల నిరూపణ చేసుకోవాలనేది ఆ లేఖ సారాంశం. మహారాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిందనడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేఖ కాస్సేపట్లోనే వైరల్ అయిపోయింది.

అది ఫేక్ లెటర్, స్పందించిన గవర్నర్ కార్యాలయం

ఈ వార్తపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ కార్యాలయం స్పందించింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను బల నిరూపణకు సిద్ధం కావల్సిందిగా కోరినట్టు వస్తున్న వార్తల్ని ఖండించింది. గవర్నర్ కార్యాలయం ఈ వార్తను ఖండించడంతో ఆ లెటర్ ఫేక్ అని తేలింది. 

బీజేపీ మహారాష్ట్ర నేత , మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముంబైలోని రాజ్‌భవన్ కార్యాలయంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీతో భేటీ అనంతరం ఈ ఫేక్ లెటర్ వైరల్ కావడం విశేషం. గవర్నర్ కంటే ముందు దేవేంద్ర ఫడ్నవిస్ హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఢిల్లీలో భేటీ అయ్యారు. 

Also read: Threaten to Modi: ప్రధాని మోదీని బెదిరించిన ఉదయ్‌పూర్ హంతకులు, వీడియో విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News