Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. నైరుతి దిశగా వెళ్తోందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి ఉన్న తూర్పు-పశ్చిమ ద్రోణి ఇవాళ బలహీన పడింది. ఇటు రాగల 24 గంటల్లో ఈశాన్య, దాని పరిసరాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. రాగల మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో అక్కడక్కడ ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ముసురు పట్టుకుంది. నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదాలకు ఇక్కట్లు తప్పడం లేదు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాగల మూడురోజులపాటు ఇలాంటి వాతావరణం ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. దీంతో ఏపీపైనే ఆవర్తనం ఎఫెక్ట్ అధికంగా ఉంది. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. తీరం వెంట మరిన్ని వర్షాలు పడనున్నాయి. ఈదురుగాలులు సైతం గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అమరావతి, విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు రాయలసీమలోనూ గతంలో ఎన్నడూలేనివిధంగా వర్షపాతం నమోదు అవుతోంది. రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also read:విజయ్, నా గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!
Also read:IND vs SA: టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా ఆడనున్నాడా..? బీసీసీఐ చీఫ్ క్లారిటీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి