Aborted Fetuses: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బెల్గావి జిల్లాలోని మూదలగి గ్రామ శివారులో ఏడు పిండాలు కలకలం రేపాయి. బస్టాప్‌కు కొద్ది దూరంలోని మురికి కాలువలో ఓ డబ్బాలో ఈ పిండాలు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు పిండాలను డబ్బాలో పెట్టి కాలువలో విసిరేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న కొందరు డబ్బాను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. అందులోని మృత పిండాలన్నీ ఐదు నెలల వయసు ఉన్నవిగా గుర్తించారు. వాటిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా వైద్యాధికారి డా.మహేష్ కోని ఈ ఘటనపై స్పందిస్తూ.. మొదట పిండాల లింగ నిర్ధారణ చేయాల్సి ఉంటుందన్నారు.
ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఈ పిండాలను బెల్గావి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపిస్తామన్నారు. దీనిపై కొంతమంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిస్తామన్నారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
డబ్బాలో ఉన్న మృత పిండాలు ఆడ శిశువులవిగా అనుమానిస్తున్నారు. ఏదైనా ప్రైవేట్ ఆసుత్రిలో అబార్షన్ ద్వారా వీటిని తొలగించి ఉంటారని అనుమానిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులకు కక్కుర్తిపడి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఘటన చోటు చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: దేశంలో 50 రాష్ట్రాల ఏర్పాటు..? ముక్కలు కానున్న ఆ రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
Also Read: Draupadi Murmu : అత్యంత పేద కుటుంబం.. గృహహింస బాధితురాలు! ద్రౌపది ముర్ము జీవితం విషాదభరితం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి