మోదీ బాటలో.. కర్ణాటక సీఎం కుమారస్వామి

మోదీ బాటలో.. కర్ణాటక సీఎం కుమారస్వామి

Last Updated : Jun 2, 2018, 12:33 PM IST
మోదీ బాటలో.. కర్ణాటక సీఎం కుమారస్వామి

అధికారులు, ప్రభుత్వ సిబ్బంది మొబైల్ ఫోన్లను ఉపయోగించవద్దని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి శుక్రవారం కోరారు. ఈ మేరకు అధికారిక సమావేశాల సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదని అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. మీటింగ్ జరుగుతున్నప్పుడు కొందరు అధికారులు సెల్‌పోన్లు చూస్తున్నారనీ.. దీని వల్ల ముఖ్యమైన విషయాలపై చర్చలకు ఇబ్బంది కలుగుతోందని కుమరస్వామి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కనుక తన సమావేశాలకు సెల్ ఫోన్లను తీసుకురావోద్దని సూచించారు.

తాను ఎప్పుడు సమావేశాలకు పిలిచినా... అధికారులందరూ తమవెంట మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదని.. సమావేశం ముగిసే వరకు వాటిని కోఆర్డినేషన్ అధికారికి అప్పగించాలని చెప్పారు. సమావేశాల మధ్యలో అధికారులు తరచూ సోషల్ మీడియా సైట్లను చెక్ చేసుకుంటూ కనిపించడంతో... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే సమావేశాల్లో ఉన్నతాధికారులు సెల్‌ఫోన్లను వాడడంపై నిషేధం విధించారు. ప్రధాని మోదీ తరహాలోనే తన సమావేశాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా కుమారస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

Trending News