Manmohan Singh Condolence: భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించింది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ప్రధానికి బీఆర్‌ఎస్ బృందం ఢిల్లీ చేరుకుంది. నివాళులర్పించిన అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాజీ ప్రధాని మన్మోహన్ సేవలను శ్లాఘించారు. ఆయనను కోల్పోవడం భారతదేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. భారతదేశానికి దిశానిర్దేశం చేయడం మాత్రమే కాకుండా ఒక ఆర్థిక వేత్తగా.. ఒక పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్న మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.
Also Read: Manmohan Singh Funeral: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల షెడ్యూల్ ఇదే!
ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబసభ్యులను కేటీఆర్‌తోపాటు ఎంపీలు సురేశ్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో భారతదేశానికి వన్నె తెచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని తెలిపారు. 'ఏనాడు.. ఏ వివాదం జోలికిపోకుండా కేవలం భారతదేశం బాగోగులు.. మంచిని కాంక్షించిన వ్యక్తి. అందరితో కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తి' అని కొనియాడారు.
Also Read: Half Day Holiday: మాజీ ప్రధానికి సంతాపంగా రేపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకపూట సెలవు
'తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు మన్మోహన్ సింగ్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. దాదాపు రెండు సంవత్సరాలపాటు మన్మోహన్ మంత్రివర్గంలో కేసీఆర్ పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. తెలంగాణ కోసం మన్మోహన్ సింగ్ దిశానిర్దేశం చేశారు. 2004లో మంత్రివర్గంలో చేరిన తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ మన్మోహన్ ఎంతో భరోసా ఇచ్చారు' అని కేటీఆర్ గుర్తుచేశారు.
'తెలంగాణ ఏర్పాటులో న్యాయమైన డిమాండ్ ఉందని కాంక్షించిన నాయకుడు మన్మోహన్ సింగ్' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారతదేశంలో ఆర్థిక సంక్షోభంలో నుంచి బయట వేయడమే కాకుండా.. ప్రపంచంలోనే మన దేశానికి మంచి పేరు తీసుకురావడం మాత్రమే కాకుండా సౌమ్యుడుగా.. వివాదరహితుడుగా భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారు' అని కేటీఆర్ వివరించారు. కాగా శనివారం జరగనున్న మన్మోహన్ అంత్యక్రియల్లో కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ పార్టీ మంత్రులు పాల్గొననున్నారు.
కాగా అంతకుముందు కేసీఆర్ ఓ ప్రకటనలో మన్మోహన్ సింగ్ సేవలను కీర్తించారు. ‘దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టుగా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారు. తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్‌తో ఉంది. వారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధం ఉన్నది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు. తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు, బీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ వారు అండగా నిలిచారు' అని మన్మోహన్‌తో కేసీఆర్ తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.