ఆ పనికి ఒప్పుకోలేదని ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన మహిళ

Acid Attack In Kerala: పెళ్లికి ఒప్పుకోలేదని నెపంతో ఓ యువకుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది కేరళకు చెందిన షీబా అనే మహిళ. తనకు గతంలోనే పెళ్లి అయిన విషయాన్ని అరుణ్ అనే యువకుడ్ని ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని అతడ్ని ఒత్తిడి చేసింది. అయితే ఆమె పెళ్లి విషయం తెలుసుకున్న అరుణ్ ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో అతడిపై యాసిడ్ దాడి చేసిందీ షీబా.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 06:13 PM IST
    • ప్రియుడి ముఖంపై యాసిడ్ పోసిన మహిళ
    • పెళ్లికి ఒప్పుకోలేదని యాసిడ్ దాడి
    • యాసిడ్ ధాటికి కళ్లు కోల్పోయిన యువకుడు
ఆ పనికి ఒప్పుకోలేదని ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన మహిళ

Acid Attack In Kerala: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది కేరళకు చెందిన షీబా అనే మహిళ. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి.. అరుణ్ అనే యువకుడ్ని ప్రేమించి అతడ్ని పెళ్లాడేందుకు సిద్ధమైంది. అయితే షీబాకు పెళ్లైన విషయాన్ని పసిగట్టిన అరుణ్.. ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో అతడిపై యాసిడ్ దాడికి పాల్పడిందామె. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

ఏం జరిగిందంటే?

కేరళలోని తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే యువకుడికి కొద్దీ రోజుల క్రిత్రం ఫేస్ బుక్ లో షీబా అనే మహిళ పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే షీబాకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ విషయాన్ని అరుణ్ వద్ద దాచిపెట్టి చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. అయితే నిజం ఎక్కువ రోజులు దాగలేదన్నట్లు ఒకరోజు షీబా గుట్టు బయటపడింది. ఆమె భర్తకు విడాకులు ఇచ్చి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుందని తెలుసుకున్న అరుణ్ ఆమెను దూరం పెట్టాడు. దీంతో అతడిపై రగిలిపోయిన ఆమె అరుణ్ ని బెదిరించడం మొదలు పెట్టింది.

తనను పెళ్లి చేసుకోకపోతే పంచాయితీ పెట్టి పరువు తీస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసింది. ఇక దీంతో అరుణ్ తన స్నేహితుడిని తీసుకొని ఒక చర్చి వద్ద డబ్బు ఇవ్వడానికి వెళ్లాడు. అక్కడ మరోసారి వీరిద్దరి మధ్య పెళ్లి చర్చ జరిగింది. షీబాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు అరుణ్. దీంతో రగిలిపోయిన ఆమె తనతో తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ ని అతడి ముఖంపై కొట్టడం వల్ల అతడి ముఖం సగం కాలిపోయింది. ప్రస్తుతం అరుణ్‌ కుమార్‌ తిరువనంతపురం మెడికల్‌ కాలేజీ హాస్పటిల్‌లో చికిత్స పొందుతున్నాడు. యాసిడ్‌ దాడిలో అరుణ్‌ కుమార్‌ కంటి చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. షీబాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అరుణ్ పై షీబా యాసిడ్ దాడి చేసిన సీసీ కెమెరా వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.  

Also Read: సాగు చట్టాల రద్దుకు వడివడిగా అడుగులు- 24న కేబినెట్ ముందుకు తీర్మానం!

Also Read: నేడు రాజస్థాన్ కేబినెట్ విస్తరణ- కొత్తగా 15 మందికి చోటు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News