Sthree Sakthi Lottery: రూ.70 లక్షల లాటరీ నెగ్గినా, అంతలోనే పెను విషాదం

లాటరీలో అనూహ్యంగా రూ.70 లక్షల రూపాయలు గెలిచాడు. కానీ ఏం లాభం.. డబ్బులు తెచ్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు.

Last Updated : Mar 12, 2020, 07:33 AM IST
Sthree Sakthi Lottery: రూ.70 లక్షల లాటరీ నెగ్గినా, అంతలోనే పెను విషాదం

అదృష్టం వరించిందని సంతోషించేలోపే దురదృష్టం వెక్కిరించింది. లాటరీలో అనూహ్యంగా రూ.70 లక్షల రూపాయలు గెలిచాడు. కానీ ఏం లాభం.. డబ్బులు తెచ్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. ఈ విషాద ఘటన కేరళలోని అలప్పుజ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఆ వివరాలిలా ఉన్నాయి.. అలప్పుజ జిల్లాలోని మావెలికర గ్రామంలో సి.తంబి తన కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నాడు. ఆయన తన షాపులో లాటరీలు సైతం విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట స్త్రీ శక్తి లాటరీలు తెచ్చి విక్రయించాడు. నిర్ణీత గడువు తర్వాత అమ్ముడుపోని 10 లాటరీ టిక్కెట్లు అతడి వద్ద మిగిలాయి. కానీ లాటరీ ఫలితాలు ప్రకటించగా ఆ పది టిక్కెట్లలో ఓ టికెట్‌ నెంబర్‌కు రూ.70 లక్షల లాటరీ తగిలింది. ట్యాక్స్ మినహాయిస్తే దాదాపు రూ.60లక్షలు చేతికొస్తాయి. తంబితో పాటు ఆయన కుటుంబం ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. లాటరీ డబ్బులతో తన షాపు విస్తరించడంతో పాటు కుమార్తెలకు సాయం చేయాలని భావించాడు.

Avengers బ్యూటీ స్కార్లెట్ జాన్సన్ అందాలివిగో! 

అంతలోనే విధి వారిని వెక్కిరించింది. లాటరీ డబ్బులు తీసుకునేందుకు మంకంకుజీలోని ఫెడరల్ బ్యాంకుకు వెళ్లాడు తంబి. అక్కడ లాటరీ టిక్కెట్‌ను సబ్మిట్ చేశాడు. అంతలోనే ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. ఆయనను మావెలికర జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూనే తంబి కన్నుమూశాడు.

See Pics: నటి అందాలకు హార్దిక్ క్లీన్ బౌల్డ్ 

లాటరీ తగిలింది, కుటుంబ కష్టాలు తీరాయనుకుంటే కుటుంబ పెద్ద దిక్కునే దేవుడు తీసుకెళ్లిపోయాడంటూ స్థానికుల్ని సైతం ఈ ఘటన కలచివేసింది. తంబికి భార్య సరస్వతీ, కుమార్తెలు సరిత, సవిత ఉన్నారు. కుమార్తెలిద్దరికీ వివాహాలు జరిపించారు. 

భాగ్యలక్ష్మి బంపర్ డ్రా. . తగిలిందోచ్.. !!

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News