Delhi Hotel Issue: కశ్మీరీ వ్యక్తికి ఢిల్లీ హోటల్‌లో రూమ్ ఎందుకివ్వలేదు, ఢిల్లీ పోలీసుల ఆదేశాలున్నాయా, వీడియో వైరల్

Delhi Hotel Issue: సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో వైరల్ అవుతోంది. జమ్ము కశ్మీర్ చెందిన వ్యక్తి కావడం వల్ల హోటల్‌లో రూమ్ ఇవ్వలేదనేది ఆ వీడియా సారాంశం. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇచ్చారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 24, 2022, 01:32 PM IST
Delhi Hotel Issue: కశ్మీరీ వ్యక్తికి ఢిల్లీ హోటల్‌లో రూమ్ ఎందుకివ్వలేదు, ఢిల్లీ పోలీసుల ఆదేశాలున్నాయా, వీడియో వైరల్

Delhi Hotel Issue: సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో వైరల్ అవుతోంది. జమ్ము కశ్మీర్ చెందిన వ్యక్తి కావడం వల్ల హోటల్‌లో రూమ్ ఇవ్వలేదనేది ఆ వీడియా సారాంశం. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇచ్చారు. 

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. ఢిల్లీలో జమ్ము కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తికి హోటల్‌లో రూమ్ ఇవ్వడానికి నిరాకరించారని వీడియోలో ఉంది. జమ్ముకశ్మీర్ ఐడీ ఉన్నవాళ్లెవరికీ రూమ్ ఇవ్వవద్దని ఢిల్లీ పోలీసులు చెప్పినట్టుగా ఆ వీడియోలో ఉంది.

ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ పోలీసుల తరపు నుంచి ఇటువంటి ఆదేశాలేవీ జారీ కాలేదని స్పష్టం చేశారు. కొంతమంది నెటిజన్లు ఈ వీడియో ద్వారా ఢిల్లీ పోలీసుల పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని..వీటిపై చర్యలు తీసుకోవల్సి వస్తుందని హెచ్చరించారు.

అసలీ వైరల్ వీడియోలో ఏముంది

శ్రీనగర్‌కు చెందిన సయ్యద్ అనే ఓ వ్యక్తికి ఢిల్లీలోని ఓ హోటల్‌లో రూమ్ ఇచ్చేందుకు నిరాకరించారు. సయ్యద్ ఆ హోటల్ రూమ్‌ను ఓ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్నాడు. ఇది మార్చ్ 22న జరిగింది. ఆ హోటల్ రిసెప్షనిస్ట్ రూమ్ ఇచ్చేందుకు నేరుగా నిరాకరిస్తుంది. ఆ తరువాత ఎవరికో ఫోన్ చేయడం వీడియోలో కన్పిస్తుంది. ఈ గెస్ట్ సంగతి ఏం చేయాలని ఫోన్‌లో అడగడం కూడా చూడవచ్చు. జమ్ము కశ్మీర్ వ్యక్తులకు రూమ్ ఇవ్వద్దని పోలీసుల ఆదేశాలున్నాయని పోన్‌లో చెప్పడం కూడా వీడియోలో గమనించవచ్చు. ఈ మొత్తం వీడియోను రూమ్ బుక్ చేసినా..లభించని ఆ వ్యక్తి రికార్డు చేస్తాడు. అయితే పోలీసులు మాత్రం ఏ హోటల్‌కు కూడా ఎటువంటి ఆదేశాలివ్వలేదని అంటున్నారు. ఇది పూర్తిగా ఢిల్లీ పోలీసులు ప్రతిష్ఠకు భంగం కల్గించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నమంటున్నారు. ఇదంతా కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రభావమని కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 

Also read: Supreme Court: కరోనా మృతుల పరిహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, ఆ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News