Karnataka High Court about Hijab Row: కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఈరోజు (మార్చి 15) సంచలన తీర్పు వెల్లడించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. విద్యార్థులు విద్యాసంస్థల ప్రొటోకాల్ పాటించాల్సిందే అని పేర్కొంది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.
చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి నేతృత్వంలో జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎస్ ఖాజీలతో కూడిన కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో మత పరమైన ఆచారాలను పాటించడం తప్పనిసరి కాదని హైకోర్టు తెలిపింది. ఫిబ్రవరి 5 నాటి ప్రభుత్వ ఉత్తర్వును చెల్లుబాటయ్యేలా కేసు నమోదు చేయలేదని పేర్కొంది. మరోవైపు కర్ణాటక హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా కర్ణాటక ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక చీఫ్ జస్టిస్ అవస్థి ఇంటితో పాటు కేసుతో సంబంధమున్న అందరు జడ్జిల ఇళ్ల వద్ద భారీ భద్రతను ఉంచారు. ఈరోజు ఉడిపి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మంగళూరు, శివమొగ్గలో అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసేశారు.
విద్యా సంస్థల్లో హిజాబ్‌పై ఫిబ్రవరిలో కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో హిజాబ్‌కు మద్దతుగా.. వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఉడుపి, కుందాపుర విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ముందుగా జస్టిస్ కృష్ణ దీక్షిత్‌తో ఏర్పాటైన ఏకసభ్య ధర్మాసనం.. ఆపై త్రిసభ్య ధర్మాసనానికి విచారణను బదిలీ చేశారు. ఫిబ్రవరి 10న రంగంలోకి దిగిన త్రిసభ్య ధర్మాసనం పదిహేను రోజుల పాటు వాదనలు విన్నది. ఇక ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టిన న్యాయస్థానం.. ఈరోజు తుది తీర్పు ఇచ్చింది.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా 'ఒకే ఒక్కడు'!!
Also Read: Shivam Sharma: అమ్మ స్నేహితురాలితో బెడ్ షేర్ చేసుకున్నా.. క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook