Karnataka Elections 2023: కన్నడనాట ప్రభ కోల్పోతున్న జేడీఎస్, 109 మంది డిపాజిట్లు గల్లంతు

Karnataka Elections 2023: కన్నడ కింగ్ అలియాస్ కింగ్ మేకర్ ప్రభ కోల్పోతోంది. అంతకంతకూ పట్టు కోల్పోతున్న ఆ పార్టీ ఈసారి మరింత చతికిలపడిపోయింది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులు పెద్దఎత్తున డిపాజిట్లు కోల్పోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2023, 09:23 AM IST
Karnataka Elections 2023: కన్నడనాట ప్రభ కోల్పోతున్న జేడీఎస్, 109 మంది డిపాజిట్లు గల్లంతు

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023లో జనతాదళ్ ఎస్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 109 మంది పార్టీ అభ్యర్ధులు డిపాజిట్ కోల్పోయారు.  ఇంతపెద్దమొత్తంలో అభ్యర్ధులు డిపాజిట్ కోల్పోవడం ఓ రికార్డు. సొంత రాష్ట్రంలో జేడీఎస్ పట్టు కోల్పోతుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు స్థానిక ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌ను పూర్తిగా నిరాశపర్చాయి. 149 స్థానాల్లో పోటీ చేయగా, కేవలం 19 సీట్లు గెల్చుకుంది. 2018 ఎన్నికల్లో 37 స్థానాలు గెలిచిన పార్టీ ఈసారి సగానికి పడిపోయింది. 2004, 2018 ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వాల పుణ్యమా అని అధికారంలో భాగమైన పార్టీ అప్పట్నించే ప్రభ కోల్పోతూ వస్తోంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో 58 స్థానాలు గెల్చుకుంది. అప్పటి ఓటు షేర్ 20.77 శాతం. 

ఆ తరువాత 2008 ఎన్నికలనాటికి 28 స్థానాలకు పడిపోయింది. తిరిగి 2013 ఎన్నికలకు పార్టీ పుంజుకుంది. ఈసారి 40 స్థానాలు గెల్చుకుంది. ఆ తరువాత 2018 గత ఎన్నికలనాటికి కాస్త వెనుకబడి 37 స్థానాలు సాధించింది. ఇప్పుడు 2023లో జరిగిన ఎన్నికల్లో బాగా వెనుకబడిపోయింది. కేవలం 19 స్థానాలతో సరిపెట్టుకుంది. 2004, 2018లో ఆ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. ఓసారి కాంగ్రెస్‌తో, మరోసారి బీజేపీతో, ఇంకోసారి కాంగ్రెస్‌తో జతకట్టింది.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 149 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లోనే విజయం సాధించింది. ఏకంగా 109 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందంటే ఆ పార్ట పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. భారీగా అభ్యర్ధులు డిపాజిట్ కోల్పోవడం ఇదే రికార్డు. గతంలో అంచే 2022లో ఆప్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 181 మంది అభ్యర్ధుల్ని బరిలో దింపి 128 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడు ఆ రికార్డును జేడీఎస్ బ్రేక్ చేసింది.

ఒకప్పుడు దేశానికి ప్రధానిగా చేసిన దేవగౌడ, అతని కుమారుడు కుమారస్వామి నేతృత్వంలోని పార్టీ రాష్ట్రంలో అంతకంతకూ ప్రభ కోల్పోతోంది. ఈసారి ఎన్నికల్లో దేవెగౌడ మనుమడు, కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ సైతం ఓడిపోయాడు. కర్ణాటకలో జేడీఎస్‌కు కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంలో కూడా పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. పార్టీ అంతకంతకూ పట్టు కోల్పోతోంది. 

Also read: Karnataka Election Result 2023 Live: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు.. సీఎం రేసులో ఎవరంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News