Who Is Sunil Kanugolu: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ బూస్ట్ ఇచ్చాయి. ఇన్నాళ్లు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎక్కువగా ఓటమే చవిచూసిన కాంగ్రెస్‌కు కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో సమరోత్సాహం నెలకొంది. 224 అసెంబ్లీ స్థానాల్లో 136 సీట్లు గెలుచుకుని.. అధికార బీజేపీకి షాక్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ గెలుపును తన ఖాతాలో వేసుకునేందుకు అందరూ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌కు అంత ఈజీగా విజయం అయితే దక్కలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ పార్టీ విజయంలో ఎందరో తెర ముందు.. తెర వెనుక పనిచేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్దరామయ్య గెలుపు కీలక పాత్ర పోషించారని అందరూ చెప్పుకుండగా.. కానీ ఓ వ్యక్తి మాత్రం తెర వెనుక ఎంతో కష్టపడి పనిచేశారు. కాంగ్రెస్ విజయానికి వ్యూహ రచన చేసి.. స్క్రిప్ట్‌ను రూపొందించి తన మార్క్‌తో కాంగ్రెస్‌కు గెలుపును కట్టబెట్టారు.
తెలుగు వ్యక్తి అయిన సునీల్ కానుగోలు చెన్నైలో పెరిగారు. ప్రస్తుతం బెంగుళూరులో నివసిస్తున్నారు. గతేడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కానుగోలును నియమించింది. 2024 ఎన్నికల కోసం గత సంవత్సరం మేలోనే కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలును సభ్యుడిగా చేర్చుకుంది. గతంలో డీఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీలతో కూడా ఆయన పని చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకేకు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకేకు ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసి సక్సెస్ అయ్యారు.
కర్ణాటక ఎన్నికలకు ముందు ఏడాది ముందే బాధ్యతలు చేపట్టిన సునీల్ కానుగోలు.. ప్రజలతో ఎప్పుడు టచ్‌లో ఉండేవారు. వారి లోకల్‌గా ఉండే సమస్యలు తెలుసుకుంటూ.. ఆయా అభ్యర్థులతో ఆ సమస్యలపై గళమెత్తి పరిష్కార హామీలు ఇప్పించారు. బీజేపీ అవినీతిని ప్రజల ముందు ఉంచడంలో సక్సెస్ అయ్యారు. కొత్త ప్రచార పద్దతులను వెతకడం.. ప్రజల పల్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుని.. వివిధ సర్వేలు నిర్వహించారు. వీటిని బట్టి అభ్యర్థుల గెలుపునకు వ్యూహం రచించారు. ముఖ్యంగా పే సీఎం ప్రచారంతో బసవరాజ్ బొమ్మైకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వెరసి కాంగ్రెస్‌కు విజయాన్ని కట్టబెట్టింది.
2014కి ముందు ప్రశాంత్ కిషోర్‌తో కలిసి సునీల్ కానుగోలు పనిచేశారు. మెకిన్సే కన్సల్టెంట్‌గా పనిచేశారు. 2014లో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. బీజేపీ అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ (ఏబీఎమ్)కి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ఎన్నిలక కోసం వ్యహాలు సిద్ధం చేసి సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికలన్నింటిలో బీజేపీ మెజార్టీ సీట్లనే గెలుచుకుంది. 2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించరంలో కీ రోల్ ప్లే చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున పనిచేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. అందుకే ఆయనను నమ్మి కాంగ్రెస్ మరిన్ని బాధ్యతలు అప్పగించనుంది.
సునీల్ కానుగోలు ఈసారి తెలంగాణ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌కు సాయం చేయనున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను ఆయనకే అప్పగించారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఈ మూడు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈజీగా గెలుపొందచ్చని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలను ఢీకొట్టేందుకు సునీల్ కానుగోలు ఎలాంటి వ్యహాలను రచిస్తారో చూడాలి.
Also Read: IPL 2023 Points Table: రేసులో దూసుకువచ్చిన ఆర్‌సీబీ.. ఆ జట్టు మాత్రం ఔట్
Also Read: Kadapa Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Karnataka Elections Result 2023: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక తెలుగు వ్యక్తి.. ఈసారి టార్గెట్ తెలంగాణ..!