Omicron XE Variant: ఇండియాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ, ఆందోళన రేపుతున్న కాన్పూర్ నివేదిక

Omicron XE Variant: కరోనా మహమ్మారికి సంబంధించి మరో ఆందోళనకర విషయం బయటపడింది. యూకే, చైనా దేశాల్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇండియాలో వెలుగుచూసింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 6, 2022, 08:03 PM IST
Omicron XE Variant: ఇండియాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ, ఆందోళన రేపుతున్న కాన్పూర్ నివేదిక

Omicron XE Variant: కరోనా మహమ్మారికి సంబంధించి మరో ఆందోళనకర విషయం బయటపడింది. యూకే, చైనా దేశాల్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇండియాలో వెలుగుచూసింది. 

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో..ఒక్కసారిగా పిడుగులాంటి వార్త భయపెడుతోంది. ఇండియాలో మరోసారి కొత్త వేరియంట్లు వెలుగు చూడటం కలకలం కల్గిస్తోంది. యూకే, చైనా దేశాల్లో ఆందోళనకరంగా మారిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ ఇప్పుడు ముంబైలో వెలుగు చూసినట్టు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఇదే ఇప్పుడు ఆందోళన రేపుతోంది. ఒమిక్రాన్‌కు సంబంధించి రెండు వేరియంట్లు కనుగొన్నారు అధికారులు. 

మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో ఒకరికి ఒమిక్రాన్ ఎక్స్‌ఈ వేరియంట్ సోకినట్టు తేలింది. మరో వ్యక్తికి ఒమిక్రాన్ కాపా వేరియంట్ నమోదైందని వైద్యులు తెలిపారు. ఈ కొత్తరకం వేరియంట్ సోకినవారిలో వ్యాధి తీవ్ర లక్షణాల్లేవని..ఆక్సిజన్ లేదా ఐసీయూ అవసరం కూడా లేదని తెలిసింది. అయితే సంక్రమణ ఒమిక్రాన్‌తో పోలిస్తే పదిరెట్టు వేగవంతం కావడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. జూన్ 22 నుంచి దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభమవుతుందని కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు చెప్పిన నేపధ్యంలో ముంబైలో వెలుగు చూసిన ఎక్స్‌ఈ వేరియంట్ ఆందోళన రేపుతోంది. 

Also read: Indian Railways Latest News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఆ సేవలు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News