విద్యుత్ పొదుపులో "కాచిగూడ రైల్వేస్టేషన్" నెంబర్ 1

భారతదేశంలో విద్యుత్ పొదుపు చేసే ఏ1 రైల్వేస్టేషన్లలో హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్ నెంబర్ వన్ స్థానాన్ని పొందింది.

Last Updated : Dec 9, 2017, 05:11 PM IST
విద్యుత్ పొదుపులో "కాచిగూడ రైల్వేస్టేషన్" నెంబర్ 1

భారతదేశంలో విద్యుత్ పొదుపు చేసే ఏ1 రైల్వేస్టేషన్లలో హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్ నెంబర్ వన్ స్థానాన్ని పొందింది. ఒక రకంగా దేశంలో మెజారిటీ స్థాయిలో విద్యుత్‌ను పొదుపు చేసిన తొలి రైల్వేస్టేషన్ కూడా కాచిగూడ కావడం గమనార్హం.

ఇటీవలే ఈ స్టేషనులో 1312 సాధారణ ఎలక్ట్రిక్ బల్బులను తొలిగించి.. వాటి స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. అలాగే ఎక్కువ విద్యుత్ ఖర్చయ్యే 370 సీలింగ్ ఫ్యాన్లను, బ్రష్ లెస్ డీసీ ఎలక్ట్రికల్ మోటర్ ఫ్యాన్లతో భర్తీ చేశారు.

ఇలా చేయడం వల్ల ఈ రైల్వేస్టేషన్ అధికారులు 1.76 లక్షల యూనిట్లు పొదుపు చేశారు. అంటే దాదాపు సంవత్సరానికి 14 లక్ష రూపాయలకు పైగానే రైల్వేశాఖకు ఖర్చు తగ్గించారట. నైజాం పాలనలో నిర్మించిన ఈ రైల్వేస్టేషన్ ఇటీవలే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1916లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఈ రైల్వేస్టేషన్ నిర్మించారు. 

 

Trending News