Jharkhand road accident: బస్సు, కారు ఢీ.. మంటల్లో ఐదుగురు సజీవ దహనం

కారు, బస్సు ఢీకొన్న తాకిడికి వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఆ మంటలు బస్సులోకి వ్యాపించాయి. దీంతో వాహనంలో చిక్కుకున్న వారు బయటికి రావడానికి వీలు లేక అందులోనే కాలిబూడిదయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2021, 11:10 PM IST
Jharkhand road accident: బస్సు, కారు ఢీ.. మంటల్లో ఐదుగురు సజీవ దహనం

Jharkhand road accident killed five people: ఝార్ఖండ్‌లోని రామ్​గఢ్ జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాగనార్ కారు, బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ముర్బండకు సమీపంలోని రాజ్రప్ప పోలీసు స్టేషన్ పరిధిలో 23వ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కారు, బస్సు ఢీకొన్న తాకిడికి వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఆ మంటలు బస్సులోకి వ్యాపించాయి. దీంతో వాహనంలో చిక్కుకున్న వారు బయటికి రావడానికి వీలు లేక అందులోనే కాలిబూడిదయ్యారు. 

మృతుల్లో నలుగురు పెద్ద వాళ్లు, ఓ టీనేజ్ కుర్రాడు ఉన్నారు. చనిపోయిన (Deceased) పెద్ద వారిలో ఇద్దరు పురుషులు, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Also read : Shocking Video: మంట కలుస్తున్న మానవత్వం.. కూతురిని ప్రేమించాడని సుత్తితో అటాక్ 

బాధితులు అందరూ పట్నాకు చెందినవారిగా పోలీసులు గుర్తించామని, ఈ రోడ్డు ప్రమాదానికి (Jharkhand road accident) గల కారణాలు ఏంటనేది దర్యాప్తులో వెల్లడి అవుతుందని జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు.

Also read : Air India For Sale: అమ్మకానికి ఎయిర్ ఇండియా, కొనేదెవరో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News