జెట్ ఎయిర్‌వేస్ ఎన్నిక చేసుకున్న పలు ప్రత్యేక మార్గాల మధ్య రూ.1,177కే విమాన సేవలు అందిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద ఎంపికైన మార్గాల్లోనే ఈ ధరలు వర్తించనున్నట్టు జెట్ ఎయిర్‌వేస్ స్పష్టంచేసింది. ప్రాంతీయ నగరాలు, పెద్ద నగరాలకు మధ్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్) ప్రకారమే జెట్ ఎయిర్‌వేస్ ఈ కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సామాన్యుడికి విమానయానం అందుబాటులోకి తీసుకురావాలనే ఉడాన్ పథకాన్ని అనుసరించే తాము ఈ సేవలు ప్రాంరభిస్తున్నట్టు సదరు విమానయాన సంస్థ తెలిపింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవల నిర్వహణ కోసం 72 సీట్లు కలిగిన విమానాన్ని వినియోగించనున్నట్టు సంస్థ పేర్కొంది.
p>
An auspicious start to the UDAN scheme for Allahabad airport with the launch of Jet Airways flights to Lucknow and Patna. pic.twitter.com/gbjpP9lfqn
— Nand Gopal Gupta Nandi (@NandiGuptaBJP) June 14, 2018
పూణె, అలహాబాద్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలను అనుసంధానం చేసే ఈ పథకం సామాన్యులకు విమాన సేవలను చేరువ చేస్తున్నట్టు సంస్థ అభిప్రాయపడింది.