JEE Mains 2021 fourth session Exam Dates: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్స్ 2021 (JEE Mains 2021)పై కీలక ప్రకటన వచ్చేసింది. జేఈఈ మెయిన్స్ నాలుగో విడత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మరోసారి వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇదివరకే తొలి మూడు ఎగ్జామ్స్ షెడ్యూల్స్‌లో మార్పులు చోటుచేసుకోగా, తాజాగా జేఈఈ మెయిన్స్ నాల్గో విడత పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జులై 28నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే మూడో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలకు, నాల్గో విడత జేఈఈ మెయిన్స్‌కు మధ్య నెల రోజుల గడువు ఉండాలని దాదాపు లక్ష మంది అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంలో రీషెడ్యూల్ (JEE Mains Exams Schedule) చేసినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 2 తేదీల మద్య జేఈఈ మెయిన్స్ 2021 నాలుగో సెషన్ ఎంట్రెన్స్ నిర్వహించనున్నారు. ఆగస్టు 26, 27, మరియు 31, సెప్టెంబర్ 1, 2 తేదీలలో నాలుగో సెషన్ నిర్వహించనున్నారు. దరఖాస్తులకు జులై 20 వరకు గడువు పొడిగించినట్లు ట్వీట్ ద్వారా తెలిపారు.
Also Read: OU VI semester exams schedule: ఓయూ సెమిస్టర్ పరీక్షలు షెడ్యూల్ ఖరారు
Accordingly, the JEE(Main) 2021 session 4 will now be held on 26th, 27th & 31st August, and on 1st and 2nd September, 2021. A total of 7.32 lakh candidates have already registered for JEE(Main) 2021 session 4.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 15, 2021
కరోనా కేసులు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను 232 నుంచి 334కు పెంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ డైరెక్టర్ సాధన పరాషర్ వెల్లడించారు. ప్రతిరోజూ పరీక్షలు జరిగే కేంద్రాల సంఖ్యను సైతం 660 నుంచి 828కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జేఈఈ మెయిన్స్ (JEE Mains 2021) మూడో ఎడిషన్, నాల్గో ఎడిషన్‌కు మధ్య కేవలం 2 రోజుల వ్యత్యాసం ఉండటంతో విద్యార్థులు నాలుగో సెషన్‌ను వాయిదా వేయాలని కోరారు.
Also Read: Covaxin Emergency Use: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO త్వరలోనే అనుమతి
ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. నాలుగు పర్యాయలు జేఈఈ మెయిన్స్ నిర్వహించి బెస్ట్ స్కోరు ఆధారంగా సీట్ల కేటాయింపు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలలో తొలి సెషన్ పరీక్ష నిర్వహించగా, మార్చి నెలలో రెండో సెషన్, ఏప్రిల్ మరియు మే నెలలో మూడో, నాలుగో సెషన్ నిర్వహించాలని షెడ్యూల్ చేశారు. కానీ కోవిడ్19 పరిస్థితుల కారణంగా పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook