Mukesh Ambani: ముకేశ్ అంబానీ ఫ్యామిలీ లండన్‌కు మకాం మారుస్తున్నారా.. ఆ ప్రాపర్టీ అందుకే కొనుగోలు చేశారా?

భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ,ఆయన కుటుంబం తమ కుటుంబం లండన్‌కు మకాం మార్చనున్నారా...? తాజాగా రిలయన్స్ గ్రూప్ సంస్థ దీనిపై స్పష్టతనిచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 12:41 PM IST
  • ముకేశ్ అంబానీ కుటుంబం లండన్‌కు మకాం మారుస్తున్నట్లు ఊహాగానాలు
  • లండన్‌లో 300 ఎకరాల ప్రాపర్టీ కొనుగోలు
  • ఊహాగానాలపై స్పందించిన రిలయన్స్ సంస్థ
  • ఆ ప్రాపర్టీని గోల్ఫింగ్ కోసం కొనుగోలు చేసినట్లు వివరణ
Mukesh Ambani: ముకేశ్ అంబానీ ఫ్యామిలీ లండన్‌కు మకాం మారుస్తున్నారా.. ఆ ప్రాపర్టీ అందుకే కొనుగోలు చేశారా?

Mukesh Ambanis Family Moving to London: భారత అపర కుబేరుడు,ఆసియాలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి(MUKESH AMBANI) సంబంధించి గత కొద్దిరోజులుగా ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ముకేశ్ అంబానీ కుటుంబం తమ మకాంను ముంబై నుంచి లండన్‌కు మార్చనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ గ్రూప్(RELIANCE GROUP) సంస్థ ఇటీవల యూకెలోని లండన్‌‌లో 300 ఎకరాల ప్రాపర్టీని కొనుగోలు చేయడం ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది.అయితే నిజంగానే ముకేశ్ అండ్ ఫ్యామిలీ లండన్‌కు షిఫ్ట్ అవనున్నారా...?

మీడియాలో వస్తున్న ఊహాగానాలను రిలయన్స్ గ్రూప్ కొట్టిపారేసింది.ఈ మేరకు ఓ  ప్రకటన విడుదల చేసిన రిలయన్స్ గ్రూప్... అంబానీ కుటుంబం లండన్‌లో నివాసముండనుందనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆ కథనాలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది.ఓ వార్తా పత్రిక ప్రచురించిన నిరాధారమైన కథనం సోషల్ మీడియాలో ఊహాగానాలకు తెరలేపిందని పేర్కొంది. అంబానీకి,అతని కుటుంబానికి లండన్ లేదా ప్రపంచంలోని ఏ ఇతర ప్రాంతానికి షిఫ్ట్ అయ్యే ఆలోచన లేదని తెలిపింది.

Also Read: KL Rahul: ప్రేయసిని పరిచయం చేసిన టీమిండియా ఓపెనర్..వైరల్ గా మారిన ఫోటో..

లండన్‌లోని 300 ఎకరాల స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేయడంపై కూడా ఆ సంస్థ స్పష్టతనిచ్చింది.ఆ హెరిటేజ్ ప్రాపర్టీ అంబానీ నివాసం కోసం కాదని... దాన్ని ప్రీమియర్ గోల్ఫింగ్,స్పోర్టింగ్ రిసార్ట్‌గా మార్చే ఉద్దేశంతోనే కొనుగోలు చేశామని తెలిపింది. రిలయన్స్ సంస్థ విడుదల చేసిన ఈ ప్రకటనతో ముకేశ్ అంబానీ కుటుంబం లండన్‌కు షిఫ్ట్ అవుతున్నారనే ఊహాగానాలకు తెరదించినట్లయింది.ప్రస్తుతం ముకేశ్ అంబానీ కుటుంబం ముంబైలోని అల్టామౌంట్ రోడ్‌లో ఉన్న అంటిలియాలో నివాసముంటున్న సంగతి తెలిసిందే.4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా ఈ ఇంటిని నిర్మించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News