Rain Alert: నైరుతి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఇప్పుడు బలహీనపడనుంది.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతున్న అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టంపై 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఫలితంగా వచ్చే మూడ్రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ తెలిపింది.
దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని పశ్చమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చమ నైరుతి దిశగా కదులుతోంది. రానున్న 24 గంటల్లో ఇది బలహీనపడనుంది. ఫలితంగా వచ్చే మూడు రోజులు దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదముంది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. నిన్న కూడా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.
అల్పపీడనం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో చలితీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రత 2-4 డిగ్రీల వరకూ తగ్గడం గమనించవచ్చు. ముఖ్యంగా తూర్పు గోదావరి, నందిగామ, గన్నవరం, కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రత 3-7 డిగ్రీలు తగ్గింది.
Also read: Ysr Congress Party: ఎన్డీయే వర్సెస్ ఇండీ కూటమిలో ఎవరి వైపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.