న్యూఢిల్లీ: భారత్లో నిరంతరంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 991 కొత్త కేసులు నమోదు కాగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా మహమ్మారి నుండి ఇప్పటి వరకు సుమారుగా మంది కోలుకున్నారని, మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 480కి చేరింది. దేశంలో శనివారం మధ్యాహ్నం వరకు 14,378 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దేశవ్యాప్తంగా కొన్నిజిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అన్నారు.
దేశవ్యాప్తంగా 11 జిల్లాల్లో 2 వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని, కరోనా బాధితుల్లో మరణాల రేటు 3.3శాతం మాత్రమేనని, మృతుల్లో 14శాతం 45 ఏళ్లు పైబడిన వారున్నారని అన్నారు. 70శాతానికి పైగా మరణాలు 70ఏళ్లు పైబడిన వారేనని, సామాజిక దూరం అమలు విషయంలో రాష్ట్రాలు ఎక్కువ బాధ్యత వహించాలన్నారు. హాట్స్పాట్ ప్రాంతాల్లోని వారికి ర్యాపిడ్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని సూచిస్తునట్టు కేంద్రం పేర్కొంది.
Read Also: తబ్లీగీ జమాత్,రోహింగ్యాలకు లింకేంటి..?
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో వైద్య-ఆరోగ్యశాఖలో నాడు–నేడు కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీలో రోజురోజుకూ కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, దేశంలో సగటున మిలియన్ జనాభాకు 218 టెస్టులు నిర్వహిస్తుండగా, ఏపీలో 351 టెస్టులు చేస్తున్నట్టు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..