/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

ముంబై: సముద్రంలో తేలుతున్న భారీ ద్వీపంగా కనిపించే వరల్డ్ క్లాస్ విహార ఓడ కు కర్ణిక గా నామకరణం చేశారు. శుక్రవారం ముంబైలో జరిగిన నామకరణ వేడుక... జాతీయ గీతంతో ప్రారంభమైంది. ఈ వేడుక సందర్భంగా 5 రూపాయల స్టాంపును విడుదల చేశారు.  కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుభాష్ చంద్ర హాజరయ్యారు. 

కర్ణిక ప్రత్యేకతలు ఇవే....

జలేష్ క్రూయిజెస్ ఆపరేట్ చేస్తోన్న భారీ క్రూయిజ్ షిప్ కర్ణిక పేరుకు ప్రత్యేకత ఉంది.ఈ విహార ఓడకు కర్ణిక పేరుకు ఇచ్చే ఆలోచన సుముద్ర కథ నుంచి వచ్చింది.  ఈ కథలోని సముద్రపు దేవతగా దర్శనమిచ్చిన కర్ణిక పేరునే ఓడకు పెట్టారు. ఇదిలా ఉండగా భారత దేశంలోని తొలి క్రూయిజ్ షిప్ కర్ణిక లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సముద్రంలో తేలుతున్న భారీ ద్వీపంగా కనిపించే ఈ షిప్ లో మొత్తం 14 అంతస్తులు కలిగిన ఉన్నాయి. ఈ భారీ నౌకలో ఒకేసారి 2,700 మంది ప్రయాణించగల సామర్ధ్యం సొంతం. దీని  బరువు 70 వేల 285 టన్నులు.. పొడవు విషయానికి వస్తే అక్షరాల 250 మీటర్లు.

సెవెన్ స్టార్ హోటల్ సౌరక్యాలు
ఈ భారీ నౌకలో సెవెన్ స్టార్ హోటల్స్ ఉండే అన్ని హంగులు, సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఓడలో మూడు  అతిపెద్ద భోజన రెస్టారెంట్లు ఉన్నాయి.  దేశ, విదేశీ ప్రయాణికులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, భారతీయ ప్రత్యేక వంటకాలను రుచిచూపించే విధంగా రూపొందించిన లగ్జరీ నౌక ఇది. భారతీయ వంటకాలతో పాటు థాయ్, మాలా, కొరియన్, మంగోలియన్, తైవానీస్ మరియు జాపనీస్ వంటకాలు కూడా ఈ రెస్టారెంట్స్ లో లభిస్తాయి. ఇందులో అన్ని రకాల దేశీయ పానీయాలతో పాటు అంతర్జాతీయంగా దొరికే పానీయాలు కూడా లభిస్తాయి.

 

గది నుంచే సముద్ర వీక్షణ
కర్ణిక నౌకలో అతిధులు సేద తీర్చుకునేందుకు కేటాయించే గదులు ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో గడిపితే బయటి ప్రపంచాన్ని మరిచిపోతారట. ఇందులోని బెడ్  నుంచి ఫర్నీచర్ వరకు ఇలా అన్నీ కేక పుట్టించేలా ఉన్నాయట. గదిలో నుంచి సముద్రాన్ని మీక్షించేందుకు ప్రతి గదిలో వండర్ ఫుల్ విండో అమర్చారు. దీని ద్వారా గదిలో నుంచే ఏం చక్కా సముద్రాన్ని వీక్షించవచ్చు. అలాగే గదికి అటాచ్ చేస్తూ ప్రత్యేక బాల్కనీ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి సముద్రాన్ని వీక్షిస్తే వేరొక ప్రపంచానికి వెళ్లామా అనే భావన కల్గుతుందంటున్నారు నిర్వాహకులు

 

ఇంకా ఎన్నో సౌకర్యాలు...
ఇంకా చెప్పాలంటే ఇందులో టైప్ పాస్ చేసేందుకు అనేక  సౌకర్యాలు ఉన్నాయి. 24 గంటల కాఫీ షాప్ .. అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ కలిగి ఉంది. క్రూయిజ్ షిప్ లో అందమైన పెయింటింగ్ మరియు ఛాయా చిత్రాలు అలంకరించబడ్డాయి. ఇక పిల్లలకు వినోదాన్ని అందించేందుకు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని రకాల వీడియో గేమ్స్ తో పాటు  ప్రత్యేక నీటి పార్క్ కూడా ఈ క్రూయిజ్ షిప్ లో నిర్మించబడింది. సీనియర్ సిటిజన్స్ కోసం ఈ ఓడలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారు తమ ప్రయాణాన్ని పూర్తిగా సౌకర్యవంతంగా చేయడానికి చర్యలు చేపట్టారు.

సీఈవో జుర్గెన్ ఏమన్నారంటే...
జలెష్ క్రూయిజ్ అధ్యక్షుడు మరియు సీఈవో జుర్గెన్ బెలోం మాట్లాడుతూ తమ సంస్థ భారత్ కు తొలి ప్రిమియమ్ షిప్ కర్ణిక రూపంలో ఇచ్చిందన్నారు. ఇందులో అబ్బురపరిచే అనేక అందాలు, సౌకర్యాలు..అతిధుల కోసం ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ప్రయాణించే వారు అద్భుతమైన, మరిచిపోలేని అనుభవాన్ని సొంతం చేసుకుంటారని తెలిపారు. ఇదే నౌకలో కార్పొరేట్ పార్టీలు, ఆఫ్-సైట్ మరియు ఫ్యామిలీ సెలబ్రేషన్ కోసం మంచి వేదికగా ఉంటుందన్నారు. ఇందులో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటే ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతినిస్తాయని... ఆ  జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. 

హాజరైన ప్రముఖుల జాబితా..

ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత అథ్లెట్ మిల్ఖా సింగ్, ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్, ప్రముఖ టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి, ప్రఖ్యాత విమెన్  బాక్సర్ మారికోమ్, జీ గ్రూప్ కు భాగస్వామ్యమైన జీల్ సంస్థ ఎండీ మరియు సీఈవో పునిత్ గోయోంకా, ఇంటర్నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ జీ బిజినెస్ సీఈవో అమిత్ గోయెంకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు . ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు

డాక్టర్ సుభాష్ చంద్ర రియాక్షన్ ఇదే

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు డా'' సుభాష్ చంద్ర ... కర్ణిక షిప్ గురించి మాట్లాడుతూ ఏదైన కొత్త పనిని ఎవరో ఒకరు చేపట్టాల్సి ఉంటుంది.  జలేష్ క్రూయిజ్ ప్రారంభించినందుకు వారికి తన అభినందనలు తేలియజేస్తున్నానని పేర్కొన్నారు.

మిల్ఖాసింగ్ స్పందన...

ఈ సందర్భంగా ప్రసిద్ధ అథ్లెట్ మిల్ఖాసింగ్ మాట్లాడుతూ కర్ణిక ప్రారంభంతో భారత్ లో నూతన శఖం ఆరంభమైనట్లుగా ఉందన్నారు. ఈ ఆవిష్కరణ ఒక  చారిత్రక ఘట్టమన్నారు. దీన్ని స్పూర్తిగా తీసుకొని రానున్నకాలంలో మరికొన్ని కంపెనీలు ఇదే పథంలో నడుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సుష్మీత రియాక్షన్ ఇదే..

ఈ సందర్భంగా బాలీవుడ్ నటి సుష్మీతా సేన్ మాట్లాడుతూ మన ఇండియా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. నిజం చెప్పాలంటే జీవితాన్ని చక్కగా ఆస్వాదించేందుకు భారత్ ను మించిన ప్రాంతం మరోకటి లేదు. ఇలాంటి అద్భుతమైన ప్రాంతంలో ఉన్న చిన్నపాటి లోపాన్ని జలెష్ క్రూయిజ్ షిప్ పూర్తి చేసిందని చమత్కరించారు. ఈ సందర్భంగా జలెష్ క్రూజ్ సంస్థకు అమె అభిందనలు తెలిపారు. కర్ణిక క్రూజ్ షిప్ నిజంగా అద్భుతమన్నారు. ఇది కచ్చితంగా జనాల మొప్పును పొందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

మహేష్ భూపతి ఏమన్నాడంటే..

ఈ సందర్భంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి మాట్లాడుతూ క్రూయిజ్ షిప్ 'కర్ణిక' ఆవిష్కరణతో దేశం సరికొత్త చరిత్రను సృష్టించినట్లుగా ఉందని.. తాజా పరిణామం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కర్ణిక షిప్ సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.

మారికోమ్ రియాక్షన్..

ఇదే సందర్భంలో ప్రముఖ మహిళా బాక్సర్ మారికోమ్  మాట్లాడుతూ షిప్ ను వర్ణించడానికి మాటలు రావడం లేదని...ఇందులో ప్రయాణం ఊహించుకుంటునే చాలా అద్భుతంగా ఉందన్నారు.

Section: 
English Title: 
Indias first premium cruise ship karnika naming ceremony in mumbai
News Source: 
Home Title: 

భారత్ లో తొలి వరల్డ్ క్లాస్ క్రూయిజ్ షిప్ ; ముంబై వేదికగా 'కర్ణిక' నామకరణ మహోత్సవం

భారత్ లో తొలి వరల్డ్ క్లాస్ క్రూయిజ్ షిప్ ; ముంబై వేదికగా  'కర్ణిక' నామకరణ మహోత్సవం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ముంబై వేదికగా వరల్డ్ క్లాస్ క్రూయిజ్ షిప్ నామకరణ మహోత్సవం
Publish Later: 
No
Publish At: 
Saturday, April 20, 2019 - 11:35