Vande Metro Trains: త్వరలో వందే మెట్రో రైళ్లు ప్రారంభం, ఈ రైళ్ల ప్రత్యేకతలేంటి

Vande Metro Trains: భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటోంది. ఇటీవల ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కొత్తగా వందే మెట్రో రైళ్లు ప్రవేశపెట్టనుంది. ఈ రైళ్లు ప్రస్తుతం ఉన్న ఈఎంయూ రైళ్లకు ప్రత్యామ్నాయం కావచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 1, 2024, 02:21 PM IST
Vande Metro Trains: త్వరలో వందే మెట్రో రైళ్లు ప్రారంభం, ఈ రైళ్ల ప్రత్యేకతలేంటి

Vande Metro Trains: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాలను కలుపుతూ వందేభారత్ రైళ్లు ఇప్పటికే పరుగులు తీస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, అత్యధిక వేగం ఉండటంతో ఈ రైళ్లుకు ఆదరణ పెరిగింది. అందుకే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. ఇక త్వరలో మరో కొత్తరకం రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది భారతీయ రైల్వే. 

దేశంలో వందేభారత్ రైళ్ల తరువాత వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలకెక్కనున్నాయి. మరోవైపు వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతుండటంతో 60 కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టనుంది ఇండియన్ రైల్వే. ఇప్పుడు కొత్తగా వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టనున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గత ఏడాది బడ్జెట్ 2023-24 సమయంలోనే వందే మెట్రో రైళ్ల గురించి ప్రకటన చేశారు. ఇప్పుడు త్వరలో ఈ రైళ్లు పట్టాలకెక్కనున్నాయి. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే మెట్రో రైళ్లు తయారవుతున్నాయి. 

వందే మెట్రో రైళ్లు వందే భారత్ రైళ్లలానే ఉంటాయి. వందేభారత్ రైళ్లకు మినీ వెర్షన్ వందే మెట్రో రైళ్లు. ఇవి కూడా పూర్తిగా మేకిన్ ఇండియా రైళ్లు. వందే మెట్రో రైళ్లు ఉత్పత్తి, డిజైన్ గత ఏడాది పూర్తయింది. ప్రస్తుతం ఉన్న సబ్‌అర్బన్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. వందే మెట్రో రైళ్లను ఈ ఏడాది మార్చ్ నాటికి ప్రారంభించవచ్చని అంచనా. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వందే మెట్రో రైళ్ల లాంచ్‌కు సన్నాహాలు చేస్తోందని రైల్వే ప్రకటించింది. 

వందే మెట్రో రైళ్లను 300 కిలోమీటర్ల ప్రయాణం కోసం సిద్ధం చేస్తున్నారు. ఇవి ప్రస్తుతం ఉన్న ఈఎంయూ రైళ్లను రీప్లేస్ చేస్తాయి. ఈ రైళ్లను 250-300 కిలోమీటర్ల వరకూ ఆపరేట్ చేయవచ్చు. ఈ రైళ్లలో చాలా సౌకర్యాలుంటాయి. వందేభారత్ రైళ్లకుండే ఫీచర్లే దాదాపుగా ఉంటాయి. వందే మెట్రో రైళ్లలో పాసెంజర్లు నిలుచుని కూడా ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. అంటే మెట్రో రైళ్లలో ఉన్నట్టు ఉంటుంది. ప్రతి కోచ్ లో 100 మంది ప్రయాణికులకు సిట్టింగ్ ఉంటుంది. 200 మంది నిలుచుని ప్రయాణించవచ్చు. ఈ రైళ్లు గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. రైలు మొత్తం ఎయిర్ కండీషన్ ఉంటుంది. సీసీటీవీ కెమేరాలు, పీఐఎస్ సిస్టమ్, ఎల్‌సిడీ‌ డిస్‌ప్లే ఉంటాయి. 

Also read: PF Balance Check: ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News