దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆ మూడు రోజులు పలు రైళ్లు రద్దు

హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దు

Last Updated : Feb 16, 2019, 10:00 PM IST
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆ మూడు రోజులు పలు రైళ్లు రద్దు

హైదరాబాద్: ఈనెల 17, 18, 19వ తేదీల్లో ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే పలు రైలు సేవలు రద్దు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పీఆర్వో సీహెచ్‌. రాకేష్‌ మీడియాకు తెలిపారు. ఫలక్‌నుమా-లింగంపల్లి-ఫలక్‌నుమా, హైదరాబాద్‌-లింగంపల్లి-హైదరాబాద్‌ మార్గాల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన.. ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు పలు ఇతర ప్యాసింజర్‌ రైళ్లను సైతం ఆ మూడు రోజులపాటు నిలిపేస్తున్నట్టు వెల్లడించారు.

57605 నెంబర్‌ కలిగిన సికింద్రాబాద్‌ - వికారాబాద్‌ ప్యాసింజర్‌ రైలు, 57606 నెంబర్‌ కలిగిన వికారాబాద్‌-కాచిగూడ ప్యాసింజర్‌, 57517 నెంబర్‌ కలిగిన 
హైదరాబాద్‌ - తాండూర్‌ ప్యాసింజర్‌, 57518 నెంబర్‌ కలిగిన తాండూర్‌-హైదరాబాద్‌ ప్యాసింజర్‌, 11307 నెంబర్‌ కలిగిన గుల్బర్గా-హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు, 11308 నెంబర్‌ కలిగిన హైదరాబాద్‌ - గుల్బర్గా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ మూడు రోజులపాటు పూర్తిగా రద్దు చేశారు. 
 
అదే మూడు రోజులపాటు పాక్షికంగా రద్దయిన రైళ్ల వివరాలు
12747 నెంబర్ కలిగిన గుంటూరు - వికారాబాద్‌ పల్నాడు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలును సికింద్రాబాద్‌-వికారాబాద్‌ స్టేషన్స్ మధ్య రద్దు కాగా 12747 నెంబర్ కలిగిన వికారాబాద్‌ - గుంటూరు పల్నాడు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలును వికారాబాద్‌-సికింద్రాబాద్‌ స్టేషన్స్ మధ్య రద్దు చేశారు.
గుల్బర్గా-హైదరాబాద్‌ ప్యాసింజర్‌ రైలును వికారాబాద్‌-హైదరాబాద్‌ స్టేషన్స్ మధ్య, హైదరాబాద్‌-గుల్బర్గా ప్యాసింజర్‌ రైలు హైదరాబాద్‌-వికారాబాద్‌ స్టేషన్స్ మధ్య రద్దు చేయనున్నట్టు అధికారులు స్పష్టంచేశారు.

Trending News