Anti-Ship Missile: అనుకున్న లక్ష్యాన్ని ఛేదించిన యాంటీషిప్ మిస్సైల్

భారత్‌లో క్షిపణుల ప్రయోగాల పరంపర నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇటీవలనే భార‌త నౌకాద‌ళం (Navy) యాంటీషిప్ మిస్సైల్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన సంగతి తెలిసిందే. తాజాగా నావికదళం మరో నౌక విధ్వంసక క్షిపణి (Anti-ship missile) ని పరీక్షించింది.

Last Updated : Oct 30, 2020, 05:40 PM IST
Anti-Ship Missile: అనుకున్న లక్ష్యాన్ని ఛేదించిన యాంటీషిప్ మిస్సైల్

Navy War ship INS Kora fires anti-ship missile at maximum range: న్యూఢిల్లీ: భారత్ (India) ‌లో క్షిపణుల ప్రయోగాల పరంపర నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇటీవలనే భార‌త నౌకాద‌ళం (Navy) యాంటీషిప్ మిస్సైల్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన సంగతి తెలిసిందే. తాజాగా నావికదళం మరో నౌక విధ్వంసక క్షిపణి (Anti-ship missile) ని పరీక్షించింది. బంగాళాఖాతం (Bay of Bengal) లో యుద్ధనౌక కొర్వెట్టి ఐఎన్ఎస్ కోరా (Corvette INS Kora ) నుంచి జరిపిన ఈ యాంటీ షిప్ మిస్సైల్ (AShM) ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది. Also read: Anti-Ship Missile ప‌రీక్ష విజయవంతం.. వీడియో విడుదల

క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియో, ఫొటోను భారత నావికాదళం ట్విట్టర్ వేదికగా శుక్రవారం పంచుకుంది. ఐఎన్ఎస్ కోరా నుంచి జరిపిన ఈ యాంటీ షిప్ మిస్సైల్ పరీక్ష విజయవంతం అయిందని.. ఈ క్షిపణి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి పాత నౌకను పేల్చివేసినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. 

 

ఈ మేరకు నావికాదళం అధికార ప్రతినిధి ట్విట్టర్ ఖాతా నుంచి క్షిపణి పరీక్షకు సంబంధించిన చిత్రాలను, వీడియోలను పంచుకున్నారు. ఈ యాంటీషిప్ మిస్సైల్ గరిష్ట దూరాన్ని సైతం అత్యంత ఖచ్చితత్వంతో చేధించిందని నేవీ పేర్కొంది. ఇదిలాఉంటే.. భారత్, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రక్తల మధ్య భారత్ వరుసగా క్షిపణి పరీక్షలను జరుపుతూ వస్తోంది. దీంతోపాటు దేశీయంగా కూడా క్షిపణులను తయారు చేయడంపై కూడా భారత్ దృష్టి సారించింది. Also read: Bad news for PUBG lovers: ఇకపై పబ్జీ గేమ్ ఆడలేరు

Also read : JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News